'హిందువుల కలను మోదీ గుర్తుంచుకోవాలి' | Modi will realise Hindus' dream of Ram temple, says Togadia | Sakshi
Sakshi News home page

'హిందువుల కలను మోదీ గుర్తుంచుకోవాలి'

Published Sun, Dec 6 2015 6:23 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

'హిందువుల కలను మోదీ గుర్తుంచుకోవాలి' - Sakshi

'హిందువుల కలను మోదీ గుర్తుంచుకోవాలి'

భోపాల్: అయోధ్యలో రామమందిరం నిర్మాణమే హిందువుల కల అని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించాలని అంతర్జాతీయ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి ప్రవీణ్ తొగాడియా అన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత లోకసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గం ఇచ్చిన వాగ్దానం మేరకు అయోధ్యలో రామమందిరం నిర్మిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు కూల్చిన చోటే రామ మందిరం నిర్మాణం చేపడతారని తొగాడియా పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీపై తనకు నమ్మకం ఉందని.. గత లోక్సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారని తొగాడియా వ్యాఖ్యానించారు. సర్దార్ పటేల్ సోమనాధ్ ఆలయాన్ని నిర్మించినట్లుగానే, లోక్సభలో తీర్మానం ద్వారా రామమందిరం నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. రామాలయం నిర్మాణం కోసం హిందువులు ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలని వీహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement