క్రికెటర్‌ కైఫ్‌ ట్వీట్‌పై ప్రధాని స్పందన | Modi's response to Mohammad Kaif's tweet | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ కైఫ్‌ ట్వీట్‌పై ప్రధాని స్పందన

Published Sun, Mar 12 2017 9:48 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

క్రికెటర్‌ కైఫ్‌ ట్వీట్‌పై ప్రధాని స్పందన - Sakshi

క్రికెటర్‌ కైఫ్‌ ట్వీట్‌పై ప్రధాని స్పందన

లక్నో: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందిస్తూ ట్వీట్ల వర్షం కురింసింది. భారత క్రికెటర్ మహమ్మద్‌ కైఫ్‌ సైతం ప్రధానమంత్రికి ట్వీట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో భారతీయ జనతాపార్టీ అద్భుత విజయం నమోదు చేసిందని.. ముఖ్యంగా యూపీలో ఆ పార్టీ విజయం భారీగా ఉందని కైఫ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రధాని కైఫ్‌ ట్వీట్‌పై స్పందించారు. కైఫ్ అభినందనలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ.. ప్రజల నుంచి లభించిన మద్దతు చరిత్రాత్మకమైనది అని పేర్కొన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని పుల్పుర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున కైఫ్‌ పోటీచేసి.. కేశవప్రసాద్‌ మౌర్య(బీజేపీ) చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement