
సాక్షి, న్యూఢిల్లీ : ఈ మధ్యే తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన ముకుల్ రాయ్ బంపరాఫర్ కొట్టారు. బీజేపీలో చేరి ఇంకా 24 గంటలు గడవకముందే.. ఆయనకు కేంద్రప్రభుత్వం వై-ప్లస్ సెక్యూరిటీని కేటాయించింది. ఇప్పటికే రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేసిన ముకుల్ రాయ్.. ప్రస్తుతం ఎటువంటి అధికారికి పదవుల్లో లేరు.
యూపీఏ హయాంలో రైల్వేశాఖ మంత్రిగా పని చేసిన ముకుల్ రాయ్‌కి ఇప్పటివరకూ.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సెక్యూరిటీ విధులు నిర్వహిస్తోంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకు వై-ప్లస్ సెక్యూరిటీని కేటాయించడంతో.. సీఆర్‌పీఎఫ్ ఆర్మీ కమాండోలు సెక్యూరిటీ విధులు నిర్వహించనున్నారు. ముకుల్ రాయ్‌కి ఉగ్రవాదులనుంచి ప్రాణహాని ఉందన్న నిఘా వర్గాల నివేదికతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
సీఆర్‌పీఎఫ్ ఆర్మ్‌డ్ కమాండోలు ప్రస్తుతం దేశంలోని 70 మంది వీఐపీలకు భద్రతను ఇస్తున్నాయి. ఎటువంటి అధికారిక పదవిలో లేని ముకుల్ రాయ్‌కి వై-ప్లస్ భద్రతను కల్పించడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు సైనిక బలగాలను అవమానించేలా ఉన్నాయని తృణమూల్ వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment