ఒకే వేదికపై అఖిలేష్‌-ములాయం​ | Mulayam, Akhilesh share public space | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై అఖిలేష్‌-ములాయం​

Published Thu, Oct 12 2017 4:08 PM | Last Updated on Thu, Oct 12 2017 4:08 PM

Mulayam, Akhilesh share public space

సాక్షి, లక్నో : దాదాపు ఏడాది తరువాత సమాజ్‌వాదీ వ్యవస్థాపకనేత ములాయం సింగ్‌ యాదవ్‌, పార్టీ ప్రస్తుతం అధ్యక్షుడు, ఆయన కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌ గురువారం ఒకే వేదిక​మీద కనిపించారు. ఒకే వేదికమీద ఇద్దరు నేతలు కనిపించడం.. పక్కపక్కనే కూర్చోవడం వంటి దృశ్యాలతో సమాజ్‌ వాదీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతల మధ్య మళ్లీ తత్సంబంధాలు ఏర్పడేందుకు ఇది దోహదం చేస్తుందని సమాజ్‌వాదీ కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంతకూ ఏం జరిగిందంటే.. గురువారం నాడు ప్రముఖ సోషలిస్ట్‌ నేత రామ్‌ మనోహర్‌ లోహియా 50వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలేష్‌, ములాయం పక్కపక్కనే కూర్చుకున్నారు. ఈ ఇద్దరినీ ఇలా చూడ్డంతో కార్యకర్తలు ఒక్కసారిగా ఉద్వేగానికిలోనయ్యారు. కొద్దిసేపటి తరువాత ఇరువురు నేతలు లోహియా విగ్రహానికి నివాళులర్పించి వెళ్లిపోయారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement