నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్ ప్రమాణ స్వీకారం | Nagaland Chief jeliyang Sworn in as | Sakshi
Sakshi News home page

నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్ ప్రమాణ స్వీకారం

Published Sun, May 25 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్ ప్రమాణ స్వీకారం

నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్ ప్రమాణ స్వీకారం

కోహిమా: నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ నేత టి.ఆర్.జెలియాంగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులతో గవర్నర్ అశ్వనికుమార్ కోహిమాలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. నాగాలాండ్ లోక్‌సభ స్థానం నుంచి నిఫూ రియో విజయం సాధించటంతో ముఖ్యమంత్రి శుక్రవారం పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఆయనకు కేంద్రంలో నరేంద్రమోడీ మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నరేంద్ర మోడీ శుభాకాంక్షలు

నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జెలియాంగ్‌కు కాబోయే ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణించేందుకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement