నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్ | Nagaland Chief Minister jeliyang | Sakshi
Sakshi News home page

నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్

May 18 2014 1:48 AM | Updated on Sep 2 2017 7:28 AM

నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్

నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా టీఆర్ జెలియాంగ్ పగ్గాలు అందుకోనున్నారు. అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) నేతృత్వంలోని డెమొక్రాటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్) శాసన సభా పక్ష నేతగా, ముఖ్యమంత్రిగా జెలియాంగ్‌ను ఎన్నుకుంది.

కోహిమా: నాగాలాండ్ ముఖ్యమంత్రిగా టీఆర్ జెలియాంగ్ పగ్గాలు అందుకోనున్నారు. అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) నేతృత్వంలోని డెమొక్రాటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్) శాసన సభా పక్ష నేతగా, ముఖ్యమంత్రిగా జెలియాంగ్‌ను ఎన్నుకుంది. శనివారం జరిగిన డీఏఎన్ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా జెలియాంగ్‌ను కొత్త నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నైపూ రియో లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఇక్కడ కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది.

జెలియాంగ్ ప్రస్తుతం గనులు, భూగర్భ వనరులు, ప్రణాళిక శాఖల మంత్రిగా ఉన్నారు. జెలియాంగ్ అభ్యర్థిత్వానికి డీఏఎన్‌లోని పక్షాలైన జేడీయూ, ఎన్‌సీపీ, బీజేపీ, స్వత్రంతులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జెలియాంగ్ మాట్లాడుతూ.. పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు. నైపూ రియో, ఎన్‌పీఎఫ్ అధ్యక్షుడు షుర్‌హోజెలిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement