గిన్నిస్ రికార్డుల్లో మోదీ సూటు | Narendra Modi Suit sold enters Guinness World Records | Sakshi
Sakshi News home page

గిన్నిస్ రికార్డుల్లో మోదీ సూటు

Published Sat, Aug 20 2016 11:23 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

గిన్నిస్ రికార్డుల్లో మోదీ సూటు - Sakshi

గిన్నిస్ రికార్డుల్లో మోదీ సూటు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూటు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. వేలంలో అత్యధిక ధర పలికిన సూటుగా గిన్నిస్ రికార్డుల్లో నమోదైంది. ఈ మేరకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సూటు 4,31,31,311 రూపాయలకు(4.31 కోట్లు) అమ్ముడైనట్లు వెల్లడించింది. గుజరాత్ కు చెందిన లాల్జీభాయ్ తులసిబాయ్ పటేల్ 2015, ఫిబ్రవరి 20న దీన్ని దక్కించుకున్నారని తెలిపింది. 

'నరేంద్ర దామోదర్దాస్ మోదీ' పేరు కనిపించేలా తయారు చేయడం ఈ సూట్ ప్రత్యేకత. విదేశాల్లో నివసిస్తున్న రమేశ్ విరాణి వ్యాపారవేత్త ఈ సూటును మోదీకి బహుమతిగా ఇచ్చారు. దీన్ని తయారు చేయడానికి సుమారు రూ. 11 లక్షలు వెచ్చించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనకు వచ్చినప్పుడు నరేంద్ర మోదీ ఈ సూటు ధరించారు. ఖరీదైన సూటు ధరించిన మోదీపై అప్పట్లో ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement