ప్రధాని మోదీ దీపావళి పండుగ ఎక్కడో తెలుసా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈసారి దీపావళి ఎక్కడ జరుపుకొంటారో తెలుసా? ఉత్తరాఖండ్‌లోని చమోలీలో ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళంతో కలిసి ఆయన ఈ ఏడాది పండుగ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయన శనివారం బయల్దేరి ఉత్తరాఖండ్ వెళ్తున్నారు.
సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతానికి ఆయనతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా వెళ్తున్నారు. దీపావళి సందర్భంగా సైనికులకు, భద్రతా దళాలకు శుభాకాంక్షలు తెలపాలని దేశవాసులకు ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.