మహారాష్ట్ర, హర్యానాల్లో మోడీ ప్రచారం | Narendra Modi to hit campaign trail in Maharashtra, Haryana | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర, హర్యానాల్లో మోడీ ప్రచారం

Published Tue, Sep 30 2014 9:38 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

మహారాష్ట్ర, హర్యానాల్లో మోడీ ప్రచారం - Sakshi

మహారాష్ట్ర, హర్యానాల్లో మోడీ ప్రచారం

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. వచ్చే నెల 4 నుంచి మోడీ ప్రచారంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.

మహారాష్ట్రలో మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషీ ప్రచారం చేస్తారు. కాగా హర్యానాలో వీరిద్దరూ ప్రచారం చేసేదీలేనిదీ తెలియరాలేదు. మోడీ హర్యానాలో పది, మహారాష్ట్రలో 12 ర్యాలీల్లో ప్రసంగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement