
గోద్రా అల్లర్ల కేసులో చిక్కుకున్న వారి ముందు నా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.
చండీగఢ్ : ‘ప్రధాని నరేంద్ర మోదీ నన్ను చూసి అసూయపడుతున్నారేమో? నేనేం ఆయనలా పిలవని పేరంటానికి వెళ్లలేదు కదా.. అయినా గోద్రా అల్లర్ల కేసులో చిక్కుకున్న వారి ముందు నా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ పంజాబ్ మంత్రి, భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడాన్ని బీజేపీ నేతలు విమర్శించడంపై సిద్ధు ఈ విధంగా స్పందించారు. (‘సౌత్ ఇండియా కన్నా పాకిస్తాన్ బెటర్’)
శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మోదీకి ఆహ్వానం అందనందు వల్లే తనపై అసూయ పడుతున్నారని, తానేం మోదీలాగా పిలవకుండానే పాక్ మాజీ ప్రధాని (నవాజ్ షరీఫ్) పుట్టినరోజుకు వెళ్లలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సమయంలో సిద్ధు.. పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలే కాకుండా సీఎం అమరీందర్ సింగ్ కూడా సిద్ధు చర్యను తప్పుబట్టారు. అయితే సిద్ధు మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకున్నారు.
Is the PM jealous that he was not called (for Imran Khan’s oath ceremony)? Is he jealous that he went to Pakistan uninvited (for Nawaz Sharif’s birthday)? I’ll not prove my patriotism to people whose name came up in Godhra(riots case): Navjot Singh Sidhu, Congress pic.twitter.com/NSd4iCpUK1
— ANI (@ANI) November 17, 2018