ఆగస్టు15న సిద్ధూ అడుగేస్తున్నాడు | Navjot Singh Sidhu To Join Aam Aadmi Party On August 15: Sources | Sakshi
Sakshi News home page

ఆగస్టు15న సిద్ధూ అడుగేస్తున్నాడు

Published Thu, Jul 28 2016 6:11 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM

ఆగస్టు15న సిద్ధూ అడుగేస్తున్నాడు - Sakshi

ఆగస్టు15న సిద్ధూ అడుగేస్తున్నాడు

పంజాబ్: మొన్నటి వరకు బీజేపీలో ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇక ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. బీజీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన ఇక ఆప్ లో అడుగుపెట్టి పంజాబ్ లో కీలక నేతగా మారనున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున సిద్ధూ ఆప్ కండువా కప్పుకుంటారని కీలక వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే, రాష్ట్ర ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా కాకుండా ప్రచారంలో కీలక బాధ్యతలు పోషిస్తారని సమాచారం.

పంజాబ్ లో ఎలాగైన తన అధికారాన్ని విస్తరించాలని ఆప్ రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి సిద్ధూ రాకడం మంచి ఊపునివ్వనుంది. అంతేకాకుండా బీజేపీకి రాజీనామా చేస్తూ సిద్ధూ చేసిన ఆరోపణలు కూడా ఆప్ కు కలిసొచ్చేలా ఉంది. పంజాబ్ కు తనను దూరం చేయాలని బీజేపీ చూసిందని, అసలు తన మాతృభూమిని వదిలి ఎక్కడికి వెళ్లిపోతానని అందుకే తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని సిద్ధూ ఆరోపించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement