
కేరళ వరదలపై నేవీ చీఫ్..
తిరువనంతపురం : వరదలతో తల్లడిల్లిన కేరళలో సహాయ పునరావస చర్యలు ముమ్మరవుతున్న క్రమంలో రాష్ట్రాన్ని నావికా సిబ్బంది జన్మభూమిగా నౌకాదళ అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా అభివర్ణించారు. ‘హిందూ మహాసముద్రం మన కర్మభూమి అయితే..కేరళ మన జన్మభూమి‘ అని నేవీ చీఫ్ పేర్కొన్నారు.
ఇక సహాయ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నవారికి, నిర్వాసితులకు అవసరమైన సరుకులు, నిత్యావసరసామ్రాగితో ఐఎన్‌ఎస్ దీపక్ నౌక ఆదివారం కొచ్చికి చేరుకుంది. మరోవైపు ఐఎన్‌ఎస్ మైసూర్ కూడా కేరళకు బయలుదేరింది. మరోవైపు నేవీ సదరన్ నావల్ కమాండ్ రెస్క్యూ టీంలు జెమిని బోట్లు, డైవర్స్, ఇతర సామాగ్రితో గత కొన్ని రోజులుగా వరద నీటిలో చిక్కుకున్న వందలాది మందిని రక్షించిన సంగతి తెలిసిందే.