'మహా' ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ: ఎన్సీపీ
'మహా' ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ: ఎన్సీపీ
Published Thu, Sep 25 2014 9:01 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు గందరగోళంలో నెలకొన్నాయి. 25 ఏళ్లగా శివసేనతో సాగుతున్న ఎన్నికల పొత్తును బీజేపీ తెగతెంపులు చేసుకోవడం శుక్రవారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. శివసేన, బీజేపీల బాటలోనే కాంగ్రెస్, ఎన్సీపీ మైత్రికి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.
మహారాష్ట్ర ప్రభుత్వానికి రేపు మద్దతు ఉపసంహరణపై గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుకు లేఖ ఇవ్వనున్నట్టు ఎన్సీపీ నేతలు ఓ ప్రకటన చేశారు. మద్దతు ఉపసంహరణకు శుక్రవారం లేఖ ఇస్తామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మీడియాకు వెల్లడించారు.
సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ వల్లే పొత్తు కుదరడం లేదని పవార్ ఆరోపించారు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్లా చవాన్ వ్యవహరించడం లేదని అజిత్ పవార్ నిప్పులు చెరిగారు.
Advertisement