కొచ్చి: కొత్త విద్యా విధానంపై వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభమవుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. చర్చలు వచ్చే ఏడాది ప్రారంభమవుతామని, వాటిపై ఒక విధానాన్ని తీసుకురావాల్సి ఉందని శనివారమిక్కడ సీబీఎస్‌ఈ సహోదయ సదస్సులో చెప్పారు. కొత్త విద్యావిధానం రావడానికి ఏడు నెలల నుంచి మూడేళ్లు పడుతుందన్నారు.
ప్రస్తుతం దీని రూపకల్పనలో రాజకీయ నాయకులు, అధికారులు, నిపుణులు ఉన్నారని, అయితే ప్రిన్సిపాళ్లకు, టీచర్లకు, విద్యార్థులకు కూడా చోటు కల్పించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లో ఉన్న సీబీఎస్‌ఈ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లు పాల్గొన్నారు.