![Niti Aayog To Come Out With National Policy On Artificial Intelligence - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/21/inteligence.jpg.webp?itok=lpuyPsqF)
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేథ (ఏఐ)లో చైనాను అధిగమిస్తూ నూతన టెక్నాలజీపై పట్టు సాధించేలా ఏఐపై నీతి ఆయోగ్ త్వరలో జాతీయ విధానంతో ముందుకు రానుంది. నిలకడైన వృద్ధిని సాధించే క్రమంలో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఈ విధానం రూపుదిద్దుకోనుంది. 2030 నాటికి ఏఐలో భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, రిటైల్, రవాణా రంగాల్లో ఏఐ వాణిజ్య వినియోగం అమల్లోకి తెచ్చేందుకు డెడ్‌లైన్‌లను నిర్ధేశించనున్నారు.
కృత్రిమ మేథపై పరిశోధనలు చేపట్టే స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కు రాయితీలను ఈ విధానంలో పొందుపరిచే అవకాశం ఉంది. ఏఐ అమలు, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం మరో ఉన్నతస్ధాయి కమిటీని ఏర్పాటు చేయనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఏఐపై జాతీయ విధానానికి ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించే బాధ్యతను ఈ కమిటీ చేపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment