‘ఇప్పట్లో ముంబైకి వచ్చే సాహసం చేయను’ | Nitin Gadkari Said Do Not Have Daring to Visit Mumbai Right Now | Sakshi
Sakshi News home page

ఇప్పట్లో ముంబైకి వచ్చే సాహసం చేయను: గడ్కరీ

Published Tue, Jun 16 2020 3:58 PM | Last Updated on Wed, Jun 17 2020 4:25 PM

Nitin Gadkari Said Do Not Have Daring to Visit Mumbai Right Now - Sakshi

ముంబై: కరోనా వైరస్‌ దేశ ఆర్థిక రాజధానిని అతలాకుతలం చేసింది. ముంబైలో దాదాపు 60వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ముంబైకి వచ్చేంత ధైర్యం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇక్కడి పరిస్థితి చూస్తూ.. ప్రస్తుతం నాకైతే ముంబై వచ్చేంత ధైర్యం లేదు. కానీ సమయం గడిచేకొద్ది ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. 

మహారాష్ట్రలో సోమవారం 2,786 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,744 కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ముంబైలో గత 24 గంటల్లో 1,067 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యి నగరంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 59,293 కు చేరుకుంది. ఈ క్రమంలో కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్చల గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు, రేపు ముఖ్యమంత్రులతో సమావేశం అవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement