మరింత కఠినంగా నితీశ్ నిర్ణయం | Nitish Kumar introduces new law with harsher provisions to ban liquor | Sakshi
Sakshi News home page

మరింత కఠినంగా నితీశ్ నిర్ణయం

Published Sun, Oct 2 2016 4:12 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

మరింత కఠినంగా నితీశ్ నిర్ణయం - Sakshi

మరింత కఠినంగా నితీశ్ నిర్ణయం

న్యూఢిల్లీ: బిహార్ ప్రభుత్వం ఏప్రిల్ ప్రవేశపెట్టిన ప్రొహిబిషన్ చట్టం చెల్లదని పట్నా హైకోర్టు కొట్టి వేసిన రెండు రోజుల్లేనే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరో కొత్త ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ చట్టం 2016 తీసుకొచ్చారు. ఈ చట్టం నేటి నుంచి (అక్టోబర్ 2) అమలవుతుందని అన్నారు.

'ఇప్పుడు ప్రజలెవరు మద్యంపై డబ్బును గతంలో మాదిరిగా ఖర్చు చేయడం లేదు. ఆ డబ్బు ఆర్థిక పరిస్థితిని నిలదొక్కుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ది బిహార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ చట్టం 2016 ఈ అక్టోబర్ 2 నుంచి అమలవుతుంది. దీని ప్రకారం బిహార్ లో పూర్తిగా మద్యం నిషేధం. హైకోర్టు ఇచ్చిన తీర్పు గతంలో ఏప్రిల్ లో తీసుకొచ్చిన పాత చట్టానికి సంబంధించినది' అని నితీశ్ అన్నారు.

ప్రత్యేక కోర్టులు మంజూరు చేసిన బెయిల్స్ మాత్రమే ఒక వ్యక్తిని విడుదల చేసేందుకు అనుమతిస్తారని, స్టేషన్ బెయిల్స్ పనిచేయవని అన్నారు. అంతేకాదు, ఏ ఇంటి ముందు బెల్లానికి సంబంధించిన ఆనవాళ్లు, ద్రాక్షాలు గుర్తించిన ఎలాంటి ప్రశ్నలు వేయకుండానే మద్యం తయారు చేసేవారిగా పరిగణించి అరెస్టు చేసే అవకాశం ఈ చట్టంతో రానుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement