టిక్‌టాక్‌ వీడియోకు లైక్స్‌ రాలేదని.. | Noida Teen Deceased As Tik Tok Videos Fail To Get Likes | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ వీడియోకు లైక్స్‌ రాలేదని బలవన్మరణం..

Published Mon, Apr 20 2020 8:21 PM | Last Updated on Mon, Apr 20 2020 8:29 PM

Noida Teen Deceased As Tik Tok Videos Fail To Get Likes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తాను చేసిన టిక్‌టాక్‌ వీడియోలకు ఎక్కువ లైక్స్‌ రాలేదనే మనస్ధాపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలోని నోయిడాలో వెలుగుచూసింది. మృతుడిని నోయిడా సమీపంలోని సలార్పూర్‌ గ్రామానికి చెందిన నూర్‌ ఇక్బాల్‌ (18)గా గుర్తించారు. ఇక్బాల్‌ తరచూ టిక్‌టాక్‌ వీడియోలు చేస్తుంటాడని, ఇటీవల తాను చేసిన వీడియోలకు తగినన్ని లైక్స్‌ రావడం లేదని కొద్దిరోజులుగా బాదపడుతున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. తన టిక్‌టాక్‌ వీడియోలను లైక్‌ చేయాలని ఇక్బాల్‌ ప్రతిఒక్కరిని కోరుతుండేవాడని యువకుడి కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగు వారు చెప్పారని పోలీసులు తెలిపారు. ఇవే ఆలోచనలతో తీవ్ర మనస్ధాపానికి గురైన ఇక్బాల్‌ తన ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.

చదవండి: ‘షీలా కి జవాని’కి వార్నర్‌ ఇరగదీశాడు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement