చెన్నై: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 29 చివరితేదీ కాగా, ఏప్రిల్ 30న పరిశీలిస్తారు. మే 2 వరకూ ఉపసంహరించుకోవచ్చు. మే 16న ఎన్నికలు నిర్వహించి, 19న ఓట్లను లెక్కిస్తారు. తమిళనాడులో 234 స్థానాల్లో 5.6 కోట్ల మంది ఓటేయనున్నారు. పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా, 9,48,717 మంది ఓటర్లున్నారు. కేరళలో 2.5 కోట్ల మం ఓటర్లుండగా 140 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో 122 నామినేషన్లు దాఖలయ్యాయి.
బెంగాల్లో సీపీఎం కార్యకర్తల హత్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ జిల్లా లోద్నాలో ఎన్నికల తర్వాత జరిగిన హింసలో ఇద్దరు సీపీఎం కార్యకర్తలు మరణించారు. ఎస్.కె.ఫజల్ హక్యూ, దుఖిరాం దాల్‌లు గురువారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు హత్య చేశారు.
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో నామినేషన్ల సందడి
Published Sat, Apr 23 2016 1:42 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement