
ప్రియా ప్రకాష్ సాంగ్‌ను నిషేధించాలని స్మృతీ ఇరానీకి నిరసనకారుల లేఖ
సాక్షి,న్యూఢిల్లీ : కంటిబాసతో ఇంటర్‌నెట్ సంచలనంగా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ వార్తల్లో నానుతూనే ఉంది. ప్రియా హల్‌చల్ చేసిన వైరల్ సాంగ్ మాణిక్య మలరయ పూవి ట్రాక్‌ను నిషేధించాలని రజా అకాడమీ తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాసింది. ప్రియా ప్రకాష్ తొలి మూవీ ఒరు ఆదార్ లవ్‌లోని ఈ పాట వివాదాస్పదమైనన సంగతి తెలిసిందే. ఈ మళయాళీ పాట మహ్మద్ ప్రవక్తను అవమానించేలా ఉందని మంత్రికి రాసిన లేఖలో రజా అకాడమీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
సినిమా నుంచి ఈ సాంగ్‌ను తొలగించేలా సెన్సార్ బోర్డుకు, చిత్ర బృందానికి సూచించాలని రెహ్మానీ గ్రూప్ అధ్యక్షుడు అసిఫ్ సర్ధార్ మంత్రిని కోరారు. మరోవైపు ఈ పాటను వ్యతిరేకిస్తూ రజా అకాడమీ మినరా మసీదు ఎదుట నిరసన తెలిపింది. పవిత్ర వ్యక్తులను అవమానించడం మానుకోవాలని రాసిన ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. మళయాళ మూవీ ఒరు ఆదార్ లవ్ నుంచి విడుదలైన చిన్న క్లిప్‌లో ప్రదర్శించిన హావభావాలతో ప్రియా ప్రకాష్ రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment