సాక్షి, బెంగళూరు: అయోధ్యలో రామమందిరం మాత్రమే ఉండాలనీ, అక్కడ మరే నిర్మాణానికీ తాము అంగీకరించబోమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ శుక్రవారం స్పష్టం చేశారు. కర్ణాటకలోని ఉడుపిలో శుక్రవారం ప్రారంభమైన మూడురోజుల ‘ధర్మసంసద్’లో ఆయన మాట్లాడుతూ ‘బాబ్రీ మసీదు ధ్వంసమై పాతికేళ్లు అవుతోంది. ఇంకా మనం వేచి చూడటంలో అర్థం లేదు. సంఘ్ పరివార్ సేవకులు రామ మందిర నిర్మాణం ఎప్పుడని అడుగుతున్నారు. రెండేళ్లలో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరతాం. అక్కడ రామాలయం తప్ప మరే కట్టడాలు ఉండేందుకు వీల్లేదు’ అని పేర్కొన్నారు. మత మార్పిడులపై ఆరెస్సెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment