rama mandir
-
అయోధ్య రామాలయంలో ఈరోజు షెడ్యూల్ ఇదే..
-
రామ అనే శబ్దం ఏనాటిది..ఎలా పుట్టింది..?
-
అయోధ్యలో మొబైల్ ఆస్పత్రులు ఏర్పాటు
-
రామమందిర ప్రతిష్ఠాపనకు డేట్ ఫిక్స్.. ప్రముఖులకు ఆహ్వానం
ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీతో సహా 7,000 మందిని అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఇద్దరు బిలియనీర్లతో పాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా జనవరి 22, 2024న జరిగే ఈ వేడుకలకు హాజరవనున్నట్లు సమాచారం. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి 3,000 మంది వీవీఐపీలతో కలిపి మొత్తం 7,000 మందికి ఆహ్వానాలు పంపింది. ప్రముఖ టీవీ సీరియల్ 'రామాయణం'లో రాముడి పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్, సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియాకు ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయోధ్యలో పోలీసుల కాల్పుల్లో మరణించిన కరసేవకుల కుటుంబాలను సైతం ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. వీవీఐపీల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా గురువు రామ్‌దేవ్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీలు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ‘రామ మందిర ప్రతిష్టాపన ఉత్సవానికి 50 దేశాల నుంచి ఒక్కొక్కరిని ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామాలయ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులను ఆహ్వానించాం. న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులకు కూడా ఆహ్వానాలు పంపాం’ అని తెలిపారు. సాధువులు, పూజారులు, మత పెద్దలు, మాజీ సివిల్ సర్వెంట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, సంగీత విద్వాంసులు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలకు ఆహ్వానం పంపినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా! అయోధ్యలో రామమందిర నిర్మాణ అంచనా వ్యయం రూ.1,800 కోట్లు. ఆలయ నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల ద్వారా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. హిందూ దేవతల విగ్రహాల కోసం ట్రస్ట్ స్థలం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27, 2021 వరకు శ్రీ రామ జన్మభూమి మందిర్ నిధి సమర్పణ్ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు రూ.2100 కోట్ల నిధులు సేకరించినట్లు సమాచారం. ఈ మందిర నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రారంభించింది. మందిరంలో వినియోగించే టెక్నాలజీని టాటా కన్సల్టెన్సీ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ అందిస్తోంది. 161 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవుతో ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. -
శ్రీరాముని మూల విరాట్టుపై సూర్య కిరణాలు
న్యూఢిల్లీ: సూర్య భగవానుని కిరణాలు ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున అయోధ్య భవ్య రామమందిరం గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహంపై పడేలా నిర్మాణం చేపడతామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపల్ వెల్లడించారు. ఒడిశా కోణార్క్‌లో సూర్యదేవాలయం నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరిపి ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పవిత్ర గర్భగుడిలోకి సూర్య కిరణాలు ప్రసరించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఢిల్లీ, ముంబై, రూర్కీ ఐఐటీలకు చెందిన నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రామాలయ నిర్మాణం శరవేగంగా సాగుతోందని ట్రస్ట్ అధికారి ఒకరు చెప్పారు. 2023 డిసెంబర్ కల్లా గర్భగుడి నిర్మాణం పూర్తి చేసుకుని, భక్తుల దర్శనానికి సిద్ధమవుతుందని అన్నారు. ఇప్పటికే మొదటి దశ పునాది నిర్మాణం పూర్తయిందనీ, రెండో దశ నవంబర్ 15 నుంచి మొదలవుతుందని చెప్పారు. పిల్లర్ల నిర్మాణం ఏప్రిల్ 2022 నుంచి మొదలవుతుందన్నారు. -
‘సినిమాలో జోకర్‌నే.. నిజజీవితంలో హీరోని’
జోగిపేట(అందోల్): నేను సినిమాలో జోకర్‌నే.. జోకర్‌గా 1027 సినిమాలో నటించానని, నంది అవార్డు కూడా వచ్చిందని, నిజజీవితంలో మాత్రం హీరోనని మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ నాయకుడు బాబూమోహన్ అన్నారు. శుక్రవారం జోగిపేటలో రామందిర నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. తనను జోకర్ అని సంబోధిస్తూ సోషల్‌మీడి యాలో రావడంతో ఆయన స్పందించారు. కళాకారుడిగా జోకర్‌గా నటించానన్నారు. తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించినా దామోదర్ రాజనర్సింహను ఒక్క సారి వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నారు. రామందిర నిర్మాణానికి విరాళాల సేకరణ జోగిపేట పట్టణంలో రామ మంది నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక వ్యాపారస్తుల వద్దకు వెళ్లి విరాళాలలను సేకరించారు. స్థానిక సుప్రభాత్ హోటల్ యజమాని విజయ్ రూ.5వేల చెక్కును అందజేశారు. తాము సేకరించిన నిధి నేరుగా రామ మందిర ట్రస్టుకు వెళ్తుందన్నారు. మండల బీజేపీ అధ్యక్షుడు నవీన్, పట్టణ అధ్యక్షుడు సయ్య సాయికుమార్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి వెంకట రమణ, మాజీ పట్టణ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, జిల్లా నాయకులు జగన్నాథం పట్టణ నాయకులు మహేష్కర్ సుమన్, సుజీత్, పుల్కల్ మండల కార్యదర్శి శేఖర్‌గౌడ్, మండల నాయకులు పాల్గొన్నారు. -
అయోధ్య భూమి పూజ: విశ్వ హిందూ పరిషత్ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: రామజన్మభూమిలో మందిర పునర్నిర్మాణం కోసం భగవంతుని ఆరాధన ఏ రకంగా చెయ్యాలి అనే దాని గురించి విశ్వహిందూ పరిషత్ సమగ్ర కార్యాచరణ రూపొందించింది. దీనికి సంబంధించిన పత్రికా ప్రకటనను విశ్వ హిందూ పరిషత్ విడుదల చేసింది. అయోధ్య రామమందిర నిర్మాణ ప్రారంభ పూజా కార్యక్రమం రోజున కరోనా నియమాలను పాటిస్తూ ఉత్సవం ఎలా జరుపుకోవాలి అనే విషయాన్ని దానిలో వివరించారు. దీని ప్రకారం ఆగష్టు 5 వ తేదీ(బుధవారం) ప్రధాని నరేంద్రమోదీ సాధు సంతులు, వేద పండితులు, ట్రష్టు సభ్యులు, ఇతర విశిష్ట అతిధులతో కలిసి రామ జన్మభూమిలో శ్రీరామునికి విశేషమైన పూజలు చేస్తారు. ఈ చారిత్రకమైన ఘట్టాన్ని మొత్తం భారతదేశమే కాక యావత్ ప్రపంచం దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశం నలుమూలలలోని పవిత్ర నదులనుంచి సేకరించిన జలాలను, పుణ్య క్షేత్రాల నుంచి సేకరించిన మృత్తికను ఈ పూజా కార్యక్రమంలో వినియోగించనున్నారు. 2020 ఆగష్టు 5 బుధవారం రోజున ఉదయం 10.30 గంటలకు సాధుసంతులు వారి వారి పీఠాల్లో, ఆశ్రమాల్లో, దేశ విదేశాలలో నివసిస్తున్న భక్తులందరూ వారి వారి గృహాల్లో లేదా వారికి దగ్గరలో ఉండే దేవాలయాల్లో, ఆశ్రమాల్లో కలిసి కూర్చుని వారి వారి ఇష్ట దేవతల భజన, కీర్తన, జపము, అర్చనలు చేసి హారతి ఇచ్చి ప్రసాద వితరణ చెయ్యాలని విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే రామ భక్తులకు విజ్ఞప్తి చేశారు. అవకాశం ఉంటే అయోధ్యలో జరుగుతున్న పూజా కార్యక్రమం టీవీలో ప్రత్యక్ష ప్రసారం వస్తున్న సమయంలో చుట్టుప్రక్కల వారందరూ కలిసి వీక్షించే విధంగా ఆడిటోరియంలో గాని, హాల్ లో గాని పెద్ద తెరను ఏర్పాటు చేసుకుని వీక్షించే ప్రయత్నం చెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా ఇళ్ళను, ఆశ్రమాలను, పీఠాలను వీలైనంత అందంగా ఉండేటట్లు అలంకరణ చేసి అందరికి ప్రసాద వితరణ చెయ్యండి అని ఆయన విన్నవించారు. అదేవిధంగా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించండి అని రామ భక్తులను కోరారు. రామమందిర నిర్మాణంలో మీ భాగస్వామ్యం ఉండేందుకు ఎంతవరకు విరాళం ఇవ్వగలరో అంత ఇవ్వడానికి సంకల్పం చెయ్యండి అని అన్నారు. ప్రస్థుత పరిస్థితిలో భక్తులు అయోధ్య రావటం చాలా కష్ట సాధ్యమైనందున ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు, ఎవరి ఆశ్రమాల్లో వాళ్ళు ఈ ఉత్సవాన్ని ఘనంగా జరిపించండి అని పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న ప్రసార మాధ్యమాలన్నిటినీ అధికంగా ఉపయోగించుకొని ఈ విశేష కార్యక్రమంలో సమాజంలోని వ్యక్తులందరూ భాగస్వామ్యం అయ్యేటట్లు చూడండి అన్ని కోరారు. పైన పేర్కొన్న వివిధ రకాలైన పద్దతులలో కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ప్రభుత్వము, స్థానిక అధికారులు విధించిన నియమాలను అందరూ పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని మిలింద్ పరాండే సూచించారు. చదవండి: భూమి పూజకు ముహూర్తం..పూజారికి బెదిరింపు కాల్స్ -
చివరకు మిగిలింది
ఉత్తరీయం సర్దుకుంటూ రైలుదిగాడు నందగోపాల్. ఆయనకు యాభై సంవత్సరాలు పైనే ఉంటాయి. రైలు దిగిన ప్రయాణికులు ఆటోలు ఎక్కుతున్నారు.‘‘ఎక్కడికి వెళ్లాలి సార్?’’ ఒక ఆటో అతను అడిగాడు.‘‘పాలెం’’ చెప్పాడు నందగోపాల్.‘‘రామమందిరం సెంటర్ వరకూ వెళుతుందండీ! ఊళ్లోకి ఆటోలు రావు’’ అన్నాడు.‘‘సరే’’ అని బ్యాగ్ లోపల పెట్టి కూర్చున్నాడు నందగోపాల్.స్టేషన్ బయట ఉన్న చిన్న చిన్న కాకా హోటళ్ళు, వచ్చే పోయే జనాన్ని చూస్తూ ఉన్నాడు నందగోపాల్. తను ఊరు వదలి వెళ్ళి పాతికేళ్ళు అయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పుట్టిపెరిగిన ఊరిని చూస్తున్నాడు. ఊరు చాలా మారిపోయింది.‘‘రామమందిరం సెంటర్ వచ్చిందండీ’’ ఆటో అతను చెప్పాడు. అతనికి డబ్బిచ్చి కిందికి దిగాడు నందగోపాల్.ఆలోచిస్తూ చిన్నగా నడుస్తున్నాడు. అదే కరణంగారి ఇల్లు! తన చిన్నప్పుడు కరణంగారి ఇల్లే పోస్టాఫీసు, తనకి ఆరేడు ఏళ్ళ వయసు ఉంటుంది. ‘‘మా నాన్న ఇంగ్లాండు కవర్ తెమ్మన్నారండీ!’’ అని అడిగేవాడు.కరణంగారి భార్య లలితాసహస్రనామం చదువుకుంటూ పూజగదిలో నుంచి వచ్చి చదవటం ఆపకుండానే కిటికీ వైపు రమ్మని సైగ చేసేది. పోస్టాఫీసుగా వాడుకుంటున్న గది కిటికీలో నుంచి కవర్ అందించేది.వరండాలో ఉయ్యాల బల్ల మీద కూర్చొని సన్నజాజిపూల దండ గుచ్చుతున్న కరణంగారి అమ్మాయి–‘‘ఇంగ్లాండు కవర్ కావాలా! అమెరికా కవర్ వద్దా!’’ అని ఫక్కున నవ్వేది.నందగోపాల్ ముఖం మీద చిరునవ్వు కదిలింది. ఆ ఇల్లు దాటి వచ్చాడు. అదిగో! ఆ ఖాళీ స్థలంలోనే అట్లతద్దికి ఉయ్యాల కట్టేవారు. అమ్మాయిలందరూ ఉయ్యాల చుట్టూ చేరి ఊగేవారు. నందగోపాల్కి కూడా ఉయ్యాల ఊగాలని కోరికగా ఉండేది. అమ్మతో చెబితే ‘‘ఆడపిల్లలు ఆడే ఆటలు మగపిల్లలు ఆడకూడదు. అందరూ నవ్వుతారు’’ అనేది.‘‘అంటే మగపిల్లాడిగా పుట్టినందుకు ఈ జన్మలో ఉయ్యాల ఎక్కకూడదా! ఆ అనుభూతి తెలుసుకోవాలంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సిందేనా! అప్పుడు కూడా మగవాడిగానే పుడితే ఎలా?’’ ఇలా రకరకాల ఆలోచనలు వచ్చేవి నందగోపాల్కి.ఒకసారి తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ అన్న రాజగోపాల్‌కి చెప్పాడు. రాజగోపాల్ తనకన్నా మూడేళ్ళు పెద్ద. తమ్ముడు చెప్పింది విని ‘‘ఓస్! అంతేనా! నేను రోజూ స్కూల్‌కి వెళ్లే దారిలో పిల్లలపార్కు ఉంది. అందులో ఆడాళ్ళు, మగాళ్ళు అందరూ ఊగుతారు. రేపు సాయంత్రం నిన్ను కూడా తీసుకువెళతాను. ఆడుకోవచ్చు’’ అన్నాడు రాజగోపాల్. నందగోపాల్ మనసు ఆనందతరంగిణి అయింది.ఆదివారం సాయంత్రం చీకటి పడే వరకు పార్కులో ఆడుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. నందగోపాల్ అలిసిపోయి నిద్రలో తూలిపోతుంటే తమ్ముడి భుజం చుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకుని, ‘‘అదిగో! ఆ కనిపించే తాటిచెట్లు దాటి నాలుగు అడుగులు వేస్తే మన ఊరు వచ్చేస్తుంది. నిద్రపోకు, మేలుకో’’ అంటూ బుజ్జగిస్తూ నడిపించేవాడు రాజగోపాల్.తనను అంత ప్రేమగా చూసిన అన్నయ్యను పాతికేళ్ళ తర్వాత ఇప్పుడు నిర్జీవంగా చూడబోతున్నాడు. అన్న కొడుకు కళ్యాణ్ నిన్న ఫోన్ చేసి చెప్పాడు. ఉన్న పళాన బయలుదేరాడు తను. కొద్దిదూరంలో టెంట్ వేసి కనబడుతుంది. దగ్గరకు వస్తున్నకొద్దీ నందగోపాల్ గుండె వేగంగా కొట్టుకోసాగింది.దూరం నుంచి నడచి వస్తున్న ఈ కొత్తమనిషి వంక అందరూ తలతిప్పి చూడసాగారు. నందగోపాల్ టెంట్ దగ్గరకు వచ్చాడు. ఎవరూ మాట్లాడలేదు. ఏం అడగాలో తోచలేదు. ఇంతలో ఏదో పని మీద అటుగా వచ్చిన కళ్యాణ్, నందగోపాల్‌ని చూసి ‘‘రా బాబాయ్! ఇల్లు తెలిసిందా!’’ అంటూ చేతిలో బ్యాగు అందుకున్నాడు.రాజగోపాల్‌ని మార్చురీబాక్సులో పడుకోబెట్టారు.నందగోపాల్ అన్న మొహం వంక తదేకంగా చూశాడు. ఈయనని చూసి, మాట్లాడి ఇరవై అయిదేళ్ళు అయింది. అక్కడక్కడ నాలుగైదు నల్లవెంట్రుకలు తప్ప తలంతా నెరిసిపోయింది. పెదవులు నల్లగా ఉన్నాయి. మొహంలో జీవకళ లేదు. నందగోపాల్ గుండెలో నుంచి సన్నటి బాధ మెలితిరిగి కన్నీళ్ల రూపంలో బయటికివచ్చింది.కళ్యాణ్ గభాలున ఆయన్ని పట్టుకుంటూ ‘‘ఇలా రా బాబాయ్!’’ అని లోపల ఒక గదిలో కూర్చోబెట్టి ‘‘లక్ష్మీ! తాతయ్య దగ్గర కూర్చో! పెద్దతాతయ్య మనవరాలు బాబాయ్!’’ అని చెప్పి అవతలకి వెళ్లాడు.నందగోపాల్ పడక్కుర్చీలో వెనక్కి వాలాడు. ‘‘ఈ అమ్మాయి పెద్దక్క మనవరాలా! తననెప్పుడూ ఇంతక్రితం చూడలేదు’’ అనుకున్నాడు. ఆ అమ్మాయికి కూడా ఈ తాతయ్య ఎవరో తెలియదు. ముళ్ళమీద కూర్చునట్లు కూర్చుంది. అది గమనించి ‘‘నాకేమీ ఫర్వాలేదు. నువ్వెళ్ళమ్మా!’’ అన్నాడు. అన్నదే తడవుగా ‘‘బతుకు జీవుడా’’ అన్నట్లు ఆ అమ్మాయి లేచి వెళ్ళిపోయింది.నందగోపాల్కి అన్న గుర్తుకు వచ్చాడు.రాజగోపాల్‌కి పెళ్ళయి చిన్నవదిన కొత్త కుటుంబసభ్యురాలిగా వచ్చినప్పుడు నందగోపాల్ ఎంతో సంతోషించాడు. వదినతో పాటు వదిన తల్లి కూడా ‘ఒక్కగానొక్క కూతురిని వదలి ఉండలేను’ అని ఇక్కడే తిష్ట వేసింది. ఆమె దుర్బోధల వల్ల కుటుంబంలో కలతలు మొదలైనాయి. రాజగోపాల్, నందగోపాల్ మధ్య ఎడం పెరిగింది. రాజగోపాల్‌కి ఇద్దరు పిల్లలు పుట్టినా వాళ్లని వదిన ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకుంటూ మిగిలిన కుటుంబసభ్యులకు చేరువకానీయలేదు.ఆరోజు నందగోపాల్కి బాగా గుర్తు. అప్పటికి కళ్యాణ్‌కి ఏడేళ్లు, వాడి తమ్ముడికి మూడేళ్లు. నందగోపాల్ వసుంధరని ప్రేమించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. తండ్రి పోయాడని తెలిసి నందగోపాల్ వచ్చాడు. అన్నలిద్దరూ ఆస్తి చెరిసగం పంచుకుంటున్నారు. ‘‘నందూ తనకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఇంట్లో నుంచి వెళ్లిపోయి నాన్నగారిని ఎంతో బాధ పెట్టాడు. అలాంటి వాడికి వాటా ఎలా ఇస్తాం?’’ అన్నాడు రాజగోపాల్. ‘‘అవునవును’’ అన్నాడు పెద్దన్నయ్య.‘‘మీ ఇద్దరివీ పెద్ద చదువులు, గవర్నమెంట్ ఉద్యోగాలు. నాది చిన్న చదువు, ప్రైవేట్ ఉద్యోగం. ఏ ఆధారం లేకుండా ఎలా బతకను?’’ అన్నాడు నందగోపాల్.‘‘నీ గురించిన మనోవ్యథతోనే నాన్నగారు పోయారు. తండ్రిని చంపిన వెధవ్వి. ఆస్తి అడగడానికి సిగ్గు లేదూ’’ అన్నాడు చిన్నన్నయ్య.‘‘మీరిద్దరూ ఎంత స్వార్థపరులో నాకు తెలియదా! నేను కాదు, మీ మూలంగానే నాన్న పోయి ఉంటారు’’ అన్నాడు నందగోపాల్.అంతే! అన్నలిద్దరూ అతని మీద పడి కొట్టారు. తల్లి ఏడుస్తూ అడ్డు వచ్చింది. ‘‘నందూ! నీకు దణ్ణం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్లిపోరా! మీరందరూ కొట్టుకుంటుంటే నేను చూడలేను. వెళ్లిపోరా’’ రెండు చేతులు జోడించి బావురుమంది.నందగోపాల్ వెర్రివాడిలా ఒక్కక్షణం తల్లి వంక చూశాడు. మరుక్షణం విసురుగా వెళ్లిపోయాడు. దెబ్బలు శరీరానికి తగిలాయిగానీ గాయం గుండెలో అయింది నందగోపాల్కి. ఎన్నిరోజులైనా ఆ గాయం మానలేదు. మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లలేదు.సంవత్సరాలు గడిచిపోయాయి. నందగోపాల్కి ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. అతనికి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది, ఎలాగైనా నాది అనే ఒక స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని. అన్నలు తన వాటా ఇచ్చినట్లయితే ఎప్పుడో ఏర్పాటు చేసుకునేవాడు. ఆ విషయం గుర్తుకు రాగానే నందగోపాల్ మనసు వికలమయ్యేది.కొడుకు, కూతురు పెద్దయ్యారు. కొడుకు ఉద్యోగం రాగానే లోన్ తీసుకొని ఇల్లు కట్టాడు. కొంతకాలం తరువాత...కళ్యాణ్ దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది రాజగోపాల్ చనిపోయాడని. తన అడ్రస్ కోసం ఎంతో ప్రయత్నించాడట. ఇరవై అయిదేళ్ల క్రితం ఉన్న పంతం, పట్టుదల ఇప్పుడు లేదు నందగోపాల్‌లో. అన్న చేసిన అవమానం గుర్తొచ్చినా ఆవేశం రావడం లేదు. చిన్నప్పుడు తనని పార్క్‌కి తీసుకువెళ్లి నిద్రలో తూలుతుంటే బుజ్జగిస్తూ నడిపించిన అన్న గుర్తొస్తున్నాడు. తనకు అర్థం కాని లెక్కలు వివరించి, పరీక్ష పాసయ్యేటట్లు చేసిన అన్న గుర్తొస్తున్నాడు. అందుకే చివరిసారిగా చూడడం కోసం అక్కడికి వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు.‘‘మిమ్మల్ని రమ్మంటున్నారు’’ ఒక కుర్రాడు వచ్చి చెప్పాడు. పడక్కుర్చీలో పడుకుని ఆలోచనలో మునిపోయిన నందగోపాల్ ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు. లేచి, ఆ గదిలో నుంచి బయటకు వచ్చాడు. రాజగోపాల్‌ని సాగనంపడానికి సిద్ధం చేశారు.నడుము వంగిపోయి, శరీరం ముడతలు పడిపోయి ఉన్న తల్లి భోరున ఏడుస్తోంది. ఆడవాళ్లు ఆమెను గట్టిగా పట్టుకున్నారు.అన్నను చూస్తున్న కొద్దీ నందగోపాల్ మనసు పరిపరివిధాల పోతుంది. ఒంట్లో ఓపికున్నంత వరకు మన కన్నా గొప్పవాడు లేడన్నట్లు విర్రవీగుతాము. రాజగోపాల్ కూడా అదే చేశాడు. తనను కట్టుబట్టలతో వెళ్లగొట్టాడు. చిల్లిగవ్వ కూడా దక్కకుండా చేశాడు. నిలువ నీడ లేకుండా చేశాడు.ఈ పాతికేళ్లలో ఒక్కసారి కూడా ఇంటికి రమ్మని అనలేదు.ఎన్ని పండగలు, ఎన్ని సంబరాలు చేసుకున్నారు? ఒక్కదానికైనా పిలవలేదు. ఆఖరికి పెద్దన్నయ్య, పెద్ద వదిన పోయినప్పుడు కూడా తనకు తెలియజేయనీయలేదు. తర్వాతెప్పుడో తెలిసింది.అంత కఠినంగా ఉండాల్సిన తప్పు తనేం చేశాడు?చివరకు ఏంమిగిలింది? తగాదాలకు కారణమైన నేల అలాగే ఉంది, మనుషులే లేకుండా పోయారు. అనుబంధాలు పోయాయి. ఆనందాలు పోయాయి.రాజగోపాల్ మీద మట్టి కప్పుతూ ఉంటే చూడలేకపోయాడు నందగోపాల్. ఇవతలకు వచ్చాడు. అతని మనసు దీనంగా, విషాదంగా అయింది. కార్యక్రమం ముగిసిన తరువాత అందరూ స్నానాలు చేసి ఇంటికి వచ్చారు. అన్న జ్ఞాపకచిహ్నంగా ఉంచిన దీపానికి నమస్కరించాడు.లోపల గదిలో తల్లి మంచం మీద కూర్చొని ఉన్నది. నందగోపాల్ తల్లి పక్కనే కూర్చొని ‘‘నేనమ్మా, నందూని’’ అన్నాడు.ముడతలు పడిన చేతులతో కొడుకుని తడిమి, తడిమి చూసుకుంది ఆ తల్లి. కన్నీళ్ళు పెట్టుకుంది. గతాన్ని గుర్తు తెచ్చుకొని నందగోపాల్ చిన్నప్పటి విషయాలన్నీ చెప్పింది. తల్లి చెప్పేవన్నీ వింటూ మౌనంగా కూర్చున్నాడు నందగోపాల్.ఆ మర్నాడు నందగోపాల్ భార్య,కొడుకు, కూతురు కారులో వచ్చారు. అతనికి ముందురోజు సెలవు దొరకలేదు. నందగోపాల్ రైలులో వాళ్లకన్నా ముందే వచ్చేశాడు.‘‘మీ అన్నయ్యరా బుజ్జీ’’ కొడుకుకి కళ్యాణ్‌ని పరిచయం చేశాడు. కళ్యాణ్ తమ్ముడి భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకున్నాడు. పిన్నిని, చెల్లెల్ని కూడా ఎంతో ఆదరంగా చూశాడు. మూడు రోజులు గడిచిపోయాయి. వచ్చిన బంధువులందరూ దాదాపుగా వెళ్లిపోయారు.‘‘బాబాయ్! నాన్న, పెదనాన్న నీకు చేసిన అన్యాయం తెలిసింది. వాళ్లు చేసిన అన్యాయం సరిదిద్ది నీ వాటా స్థలం, పొలం నీకు అప్పగించాలని ఇన్నాళ్ళూ ఎదురుచూశాను. ఇవిగో కాగితాలు’’ అందించబోయాడు కళ్యాణ్.నందగోపాల్ అందుకోలేదు.‘‘ఇప్పుడీ ఆస్తితో నాకు పనిలేదురా కళ్యాణ్! కష్టాలు పడాల్సిన రోజులన్నీ అయిపోయాయి. భగవంతుడి దయవల్ల నా బిడ్డలిద్దరూ అభివృద్ధిలోకి వచ్చారు. నన్ను కూడా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఈ స్థలం, నా వంతు పొలం నువ్వు, అన్నయ్య పిల్లలు సమానంగా తీసుకోండి’’ అన్నాడు.కళ్యాణ్ మనసు మూగబోయినట్లయింది‘‘నా మాటగా ఒక్క విషయం గుర్తుంచుకో కళ్యాణ్! అన్నయ్య పిల్లలు, నా పిల్లలు, మీరిద్దరు అందరూ కలసిమెలసి ఉండండి. అకారణ వైరాలతో ద్వేషం పెంచుకోకండి. ఆస్తి తగాదాలు, చెప్పుడు మాటలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. మనుషుల మధ్య ఆగాధాలు పెంచుతాయి. మీ తరంలోనైనా తోడబుట్టిన వాళ్లందరూ కలసి మెలసి ఉంటూ ఆనందంగా జీవించండి. ఇన్నాళ్లు అమ్మకి నేను చేసింది ఏమీలేదు. అమ్మని నాతో పాటు తీసుకువెళతాను. కొద్దిరోజులైనా ఆమెకు సేవ చేసి కొడుకుగా నా రుణం తీర్చుకుంటాను’’ అన్నాడు నందగోపాల్.‘‘అలాగే బాబాయ్! మేమెప్పుడూ తగాదాలు పడము. నువ్వు చెప్పినట్లే చేస్తాం’’ అన్నాడు కళ్యాణ్. కళ్యాణ్, కొడుకు పక్కపక్కన కూర్చొని తన మాటలు శ్రద్ధగా వినటం చూసి చాలా ఆనందంగా అనిపించింది నందగోపాల్కి.భోజనాలు అయిన తరువాత నందగోపాల్ వాళ్లు బయలుదేరారు. డ్రైవింగ్ సీట్లో కొడుకు, పక్కనే కూతురు కూర్చున్నారు. వెనకసీట్లో మధ్యలో తల్లిని కూర్చోబెట్టుకొని చెరొక పక్కన నందగోపాల్, వసుంధర కూర్చున్నారు. కారు బయలుదేరింది.కళ్యాణ్, అతని భార్య, తమ్ముడు వాకిలి దాకా వచ్చారు. కారు కనుమరుగు అయ్యేదాకా అలాగే చూస్తూ నిలబడిపోయారు. గోనుగుంట మురళీకృష్ణ -
అయోధ్య రామ జన్మభూమిపై సుప్రీంలో పిటిషన్
-
అయోధ్య కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్ : వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయోధ్య రామ జన్మభూమిపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వివాదం లేని 67 ఎకరాల భూమిని రామజన్మభూమి ట్రస్ట్‌కు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొంది. రామ జన్మభూమి-మసీదు వివాదాస్పద ప్రాంతం 2.77ఎకరాలు కాగా 1991లో ప్రభుత్వం దాంతోపాటు వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ 67 ఎకరాల భూమిలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేపట్టరాదని గతంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తొలగించి యజమానులకు 67 ఎకరాల భూమిని అప్పగించాలని సుప్రీం కోర్టుకు కేంద్రం ప్రభుత్వం విన్నవించింది. -
అయోధ్యపై ఆర్డినెన్స్ ఉండదు
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఆర్డినెన్స్ తీసుకు వచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కోర్టు కేసు తేలేవరకు, న్యాయప్రక్రియ ముగిసేవరకు ఆర్డినెన్స్ గురించి ఆలోచించబోమన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలు ప్రజలకు, విపక్ష మహాకూటమికి మధ్యనే జరగనున్నాయన్నారు. నోట్ల రద్దు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, దాన్ని ఒక షాక్ గా చూడకూడదని, నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా ఆ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. నూతన సంవత్సర తొలి ఇంటర్వ్యూను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చారు. ప్రతిపక్షాలు, మీడియా గత కొన్నాళ్లుగా లేవనెత్తుతున్న అనేక అంశాలపై వివరణ ఇచ్చారు. మీడియా ముందుకు రావడం లేదన్న విమర్శలకు జవాబు అన్నట్లుగా దాదాపు 90 నిమిషాల పాటు ముఖాముఖిలో పాల్గొని పలు ప్రశ్నలకు సదీర్ఘ సమాధానాలిచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అయోధ్యలో రామ మందిరం న్యాయ ప్రక్రియ ముగిసేవరకు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆర్డినెన్స్ తీసుకు రావాలనుకోవడం లేదు. ఈ సమస్యకు రాజ్యాంగ పరిధిలో పరిష్కారం చూస్తామని మా మేనిఫెస్టోలో చెప్పాం. న్యాయ ప్రక్రియ పూర్తి కానివ్వండి. ఒక ప్రభుత్వంగా మా బాధ్యత ఏమిటో అది నిర్వర్తించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ట్రిపుల్ తలాక్ పై ఆర్డినెన్స్‌ను కూడా సుప్రీంకోర్టు తీర్పు తరువాతే తెచ్చాం. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ న్యాయవాదులు అడ్డంకులు సృష్టిస్తుండటం వల్లనే తీర్పు ఆలస్యమవుతోంది. 70 ఏళ్లుగా అధికారంలో ఉన్నవాళ్లు ఈ సమస్యను అపరిష్కృతంగా ఉంచేందుకే కృషి చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ అది ఒక క్లిష్టమైన నిర్ణయం. అప్పుడు రాజకీయాల కన్నా జవాన్ల భద్రత గురించి ఎక్కువగా ఆలోచించాం. ఆపరేషన్ విజయవంతం కావడం కన్నా ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్ల ప్రాణాలు ముఖ్యమనుకున్నా. అందుకే మెరుపుదాడుల తేదీలను రెండు సార్లు మార్చాం. ఆపరేషన్‌లో పాల్గొనే వారికి కఠోర శిక్షణ ఇచ్చాం. సర్జికల్ స్ట్రైక్స్ కోసం నియంత్రణ రేఖ దాటి వెళ్లిన ప్రతీ జవాను తిరిగొచ్చే వరకు ఉత్కంఠ, ఆందోళనతో ఎదురుచూశా. మెరుపుదాడుల్లో విజయం సాధించినా, పరాజయం పాలైనా.. అందరినీ సూర్యోదయం లోపే తిరిగిరావాలని ఆదేశించాం. ఉడీ ఉగ్రదాడి మన ఆర్మీ జవాన్లలో కసిని పెంచింది. పాకిస్తాన్ పాకిస్తాన్ అంత తొందరగా మారదు. ఒక్క యుద్ధం వల్ల పాక్ వైఖరిలో మార్పు వస్తుందని నేను భావించడం లేదు. అలా ఎవరు అనుకున్నా పొరపాటే. ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామా హఠాత్తుగా జరిగినదేమీ కాదు. ఏడు, ఎనిమిది నెలల క్రితమే ఆయన రాజీనామా చేస్తానన్నారు. అందుకు వ్యక్తిగత కారణాలున్నాయన్నారు. ఈ విషయం నేను ఇప్పుడు మొదటిసారి చెబుతున్నా. ఈ విషయంలో రాజకీయ ఒత్తిడులు లేనే లేవు. ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన అద్భుతంగా పనిచేశారు. నోట్లరద్దు నల్లధనం కారణంగా దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తోందనే విషయంలో సందేహం లేదు. అందుకే పెద్ద నోట్లు రద్దు చేశాం. ఇది హఠాత్తు నిర్ణయం కాదు. ఏడాది క్రితమే హెచ్చరించాం. మీ దగ్గర నల్లధనం ఉంటే బ్యాంకుల్లో దానిని డిపాజిట్ చేయండి. జరిమానాలు చెల్లించండి, అందుకు ప్రభుత్వం మీకు సాయం చేస్తుందని ఏడాది ముందుగానే ప్రజలను హెచ్చరించాం. నోట్ల రద్దు ఫలితంగా మంచాల కింద, అరల్లో దాచిన కట్టల కొద్దీ నగదు బయటపడింది. అదంతా ఇప్పుడు బ్యాంకుల్లోకి వచ్చి చేరింది. పన్నుల వసూళ్లు పెరిగాయి. ఇది గెలుపు కాదంటారా? జీడీపీతో పోలిస్తే కరెన్సీ చెలామణీ తగ్గింది. వచ్చే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. ఈ నిర్ణయాన్ని షాక్గానో, ప్రజలపై భారంగానో భావించకూడదు. మాల్యా, చోక్సీ ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు చర్యకు భయపడే వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయారు. మా ప్రభుత్వ హయాంలో పారిపోయిన ఆ ఇద్దరినీ నేడో రేపో తిరిగి తీసుకువస్తాం. దేశ ప్రజల సొమ్ము దొంగిలించిన వారి నుంచి ప్రతిపైసా తిరిగి రాబడతాం. 2019 ఎన్నికలు రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశ ప్రజలకు, విపక్ష మహా కూటమికి మధ్య జరగనున్నాయి. ఈ సారి బీజేపీకి 180 స్థానాల కన్నా ఎక్కువ రావని కొందరు చెబుతున్నారు. అలాంటి అంచనాలే 2014లోనూ వచ్చాయి. ప్రజలు నావైపే ఉన్నారనుకుంటున్నాను. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చేవారు.. ఆ ఆకాంక్షలు నెరవేరకుండా అడ్డుకునే వారు.. ఈ ఇద్దరి మధ్యనే రానున్న ఎన్నికలు జరుగుతాయి. వారి 70 ఏళ్ల పాలన ప్రజలకు గుర్తుంది. ఫెడరల్ ఫ్రంట్ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతిపాదిస్తున్న కూటమి గురించి నేను వినలేదు. నాకు తెలియదు. మోదీ మ్యాజిక్ అలా అనే వారందరికీ కృతజ్ఞతలు. 2014లోనూ కొందరు మోదీ హవా ప్రభావమేం లేదన్నారు. వాళ్లే ఇప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ హవా అనేది ఒకటుందని వారు నమ్ముతున్నందుకు నేను హ్యాపీ. దాని గురించి వారికి తెలిసినందుకు సంతోషం. నా దృష్టిలో హవా అంటే ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేవారిని విశ్వసించడమే. ప్రజలదే నిర్ణయం నా ప్రతి పనిలో నిజం ఉంది, నిజాయతీ ఉంది. నేను ఏం చేశానో, ఎలా చేశానో నిర్ణయించే బాధ్యత ప్రజలకే వదిలిపెట్టా. ప్రతిపక్షాలు మాపై దుష్ప్రచారం తప్ప మరేం చేస్తాయి? అలా చేయకుంటే వారి కూటమి ఎలా నిలుస్తుంది? మాకు హాని చేసేందుకే అవి చెడు ప్రచారం చేస్తున్నాయి. కానీ, ప్రజా తీర్పుపైనే నా విశ్వాసం. రఫేల్ ఒప్పందం రఫేల్ ఒప్పందానికి సంబంధించి చేస్తున్న ఆరోపణలు నాపై వ్యక్తిగతంగా చేస్తున్నవి కాదు. నా ప్రభుత్వంపై చేస్తున్నవి. నాపై వ్యక్తిగత ఆరోపణలైతే.. ఎవరు, ఎప్పుడు, ఎలా ఇచ్చారు? లాంటి ఆధారాలుంటే బయటపెట్టాలంటున్నా. ఊరికే బురద చల్లి పారిపోవడం కాదు. వాళ్లకు పదేపదే ఒకే విషయాన్ని అరచి చెప్పే జబ్బు ఉంది. ఈ విషయంపై పార్లమెంటులోనూ, బయట చాలాసార్లు వివరణ ఇచ్చాను. సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అసలు రక్షణ రంగ ఒప్పందాల్లో మధ్యవర్తులు ఎందుకు ఉంటారు? ‘మేక్ ఇన్ ఇండియా’ను 70 ఏళ్ల క్రితమే ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నేనా పని ఇప్పుడు చేస్తుండటమే నా నేరం. మన సాయుధ దళాలకు రక్షణ రంగ ఉత్పత్తులను సమకూర్చడానికి ప్రయత్నించడమే నేను చేస్తున్న నేరంలా ఉంది. మోదీ–అమిత్ షా ద్వయం మోదీ, అమిత్‌షాల కారణంగానే బీజేపీ ముందుకు సాగుతోందని అనుకునే వారికి బీజేపీ గురించి తెలియదు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ. ‘హర్ పోలింగ్ బూత్, సబ్సే మజ్బూత్’ అనే నినాదంతో పోలింగ్ బూత్ నుంచే బీజేపీ పని మొదలవుతుంది. మా కార్యకర్తలు 365 రోజులూ ఇదే లక్ష్యంగా పనిచేస్తుంటారు. బీజేపీని ఒకరిద్దరు నడుపుతున్నారని భావించే వారు బీజేపీ సంస్థలను అర్థం చేసుకోలేదు. పార్టీలోని ప్రతి స్థాయి లోనూ కార్యకర్తల నాయకత్వం ఉంటుంది. అది పైకి చేరేకొద్దీ అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అన్న సిద్ధాంతంతో ప్రజల మెప్పును పొందుతూ బీజేపీ ముందుకు సాగుతుంది. బీజేపీ పట్టు తగ్గుతుందంటే దానర్థం మేం నష్టపోతున్నామని కాదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం అసోం, హరియాణా, త్రిపురల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. డోక్లాం వివాదం డోక్లాం సంక్షోభ సమయంలో వ్యవహరించిన తీరును బట్టే భారత్ సామర్థ్యాన్ని నిర్ణయించాలి. చైనా చేతిలో నెహ్రూ హయాంలో మాదిరిగా భారత్ మోస పోయిందని చెప్పేంత స్థాయిలో ఏదీ జరగలేదు. అయితే, పొరుగు వారితో స్నేహాన్ని కోరుకోవాలన్నదే మన సిద్ధాంతం. మన ప్రభుత్వాలన్నీ అదే విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. మహాకూటమి తెలంగాణలో వీళ్లు చెబుతున్న మహా కూటమి ఏమైంది? అట్టర్ ఫ్లాప్ అయింది. ఐదేళ్లుగా మనం చూస్తే, కచ్చితమైన మహాకూటమి ఏర్పాటుపై ఎవరైనా మాట్లాడారా? వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఎవరు వీరు? తమను తాము రక్షించుకునేందుకు, మద్దతు కోరుకుంటూ ‘ఒకరి చేతులు మరొకరు పట్టుకుంటే అందరం సురక్షితంగా ఉంటాం’ అని అనుకునేవారు. వీరందరి ఎజెండా ఒక్కటే.. మోదీ. ఏ వార్తా పత్రికలో పది పేజీలు తిరగేసినా మోదీ ఇది చేయలేదు, మోదీ అలా మోదీ ఇలా అని విమర్శించే పది మంది కూటమి నేతల మాటలే కనిపిస్తాయి. దేశం కోసం వారేం చేయబోతున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారనే దానిపై ఏకాభిప్రాయం లేదు. మూక దాడులు సభ్య సమాజంలో ఇలాంటి వాటిని ఎవరూ సమర్ధించరు. అయితే, ఇవి 2014లోనే ప్రారంభమయ్యాయా? మన సమాజంలోని చెడు అలా బహిర్గతమవుతోంది. ఇలాంటి ఘటనలను అంతా కలసికట్టుగా ఖండించాల్సిందే. భారత దేశంలో అహింసే సంప్రదాయం. ఇది అలాగే కొనసాగుతుంది. చర్చలు, సంప్రదింపుల పైనే మనకు విశ్వాసం ఉంది. సబ్ కాసాథ్.. సబ్ కా వికాస్.. మా నినాదం. 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాం. వర్గా ల ప్రాతిపదికన ఆ గ్రామాలను ఎంపిక చేయలేదు. ‘గాంధీ’ కుటుంబం ఆ కుటుంబంలోని నాలుగు తరాల నేతలు దేశాన్ని పాలించారు. అందుకే ఆ కుటుంబాన్ని ఒకప్పుడు ‘ప్రథమ కుటుంబం’ అనేవాళ్లు. ఆ ‘ప్రథమ కుటుంబం’లోని వ్యక్తులు ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసుల్లో ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మాజీ ఆర్థిక మంత్రి(చిదంబరం) పలు ఆర్థిక అక్రమాల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవస్థల విధ్వంసం ఈ విషయంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు. పీఎంకు, పీఎంఓకు వ్యతిరేకంగా ఎన్ఏసీ(జాతీయ సలహా మండలి)ని ఏర్పాటు చేసిందెవరు? కేబినెట్ ఓ నిర్ణయం తీసుకుంటే.. ఓ పెద్ద నేత ఆ పేపర్లను ప్రెస్‌మీట్‌లోనే చింపేస్తారు. ఇదేనా వ్యవస్థను గౌరవించడం. న్యాయవ్యవస్థలోనూ తమకు అనుకూలురైన జూనియర్లను జడ్జీలుగా నియమించలేదా? ఎంతమంది ఆర్బీఐ గవర్నర్లను బలవంతంగా పంపించలేదు? వీళ్లు వ్యవస్థల విధ్వంసం గురించి మాట్లాడుతారా? ప్రణాళిక సంఘాన్ని జోకర్ల బృందంగా అభివర్ణించింది వీరు కాదా? ట్రిపుల్ తలాక్.. శబరిమల ట్రిపుల్ తలాక్, శబరిమల రెండు వేర్వేరు అంశాలు. ప్రపంచంలోని చాలా ముస్లిం దేశాలు ట్రిపుల్తలాక్ను నిషేధించాయి. కాబట్టి, ఇది మతపరమైన అంశం కాదు. పొరుగునే ఉన్న పాకిస్తాన్ కూడా ట్రిపుల్తలాక్ను నిషేధించింది. కాబట్టి, దీనిని లింగ సమానత్వానికి, సామాజిక న్యాయానికి సంబంధించిన విషయంగా గుర్తెరగాలి. ఇది మత విశ్వాసంలో భాగం కాదు. అందుకే, శబరిమల అంశంతో దీనిని పోల్చడం సరికాదు. రైతు రుణ మాఫీ రుణమాఫీతో అత్యధిక శాతం రైతులకు ప్రయోజనం కలగదు. రుణమాఫీ రాజకీయ స్టంట్. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలవి. రైతులకు సాధికారత కల్పించడమే వారి సమస్యలకు పరిష్కారం. ఆ దిశగానే మేం ఆలోచిస్తున్నాం. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతుల సంఖ్య చాలా తక్కువ. ఎక్కువగా ప్రైవేటు రుణాలే తీసుకుంటారు. వారికి రుణమాఫీతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. రుణాలు తీసుకోవాల్సి రాకుండా ఉండాల్సిన పరిస్థితి రైతులకు రావాలి. వాళ్లు పూర్తిగా రుణమాఫీ చేశామంటున్నారు. కానీ అది నిజం కా>దు. అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఉద్దేశంతోనే ‘లాలీపాప్’ కామెంట్ చేశాను. బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఏదైనా రుణమాఫీ పేరుతో ప్రజలను మభ్యపెట్టదు. రుణమాఫీతో నిజంగా ప్రయోజనం ఉంటే.. మే మూ చేసేవాళ్లం. గతంలో దేవీలాల్(ఉప ప్రధాని) సమయం నుంచి రుణమాఫీలు చేస్తూ వస్తున్నారు. 2009లో ఎన్నికల్లో గెలవడం కోసం యూపీఏ రుణమాఫీ ప్రకటించింది. రాహుల్.. గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో, అతని మాటలూ అలాగే ఉంటాయి. ప్రణబ్ ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పటి నుంచే జీఎస్టీ ప్రక్రియ కొనసాగుతోంది. పార్లమెంట్లో జీఎస్టీ బిల్లును అందరూ ఆమోదించారు. జీఎస్టీకి ముందు రోజుల్లో దేశంలో పన్ను రేటు 30 నుంచి 40 శాతం వరకు ఉండేది. దీంతోపాటు కనిపించని పన్నులు, మళ్లీమళ్లీ పన్నులు అదనంగా ఉండేవి. జీఎస్టీతో పన్ను విధానం సరళమైంది. అత్యధిక పన్ను రేటు ఉండే దాదాపు 500 వస్తువులపై జీఎస్టీ వల్ల పన్ను రద్దయింది. రోజువారీ వాడే దాదాపు 1200 వస్తువులపై పన్ను 18శాతం నుంచి దాదాపుగా 5 శాతానికి తగ్గింది. ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నాం. జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు తమను తామే విమర్శించుకుంటున్నారా లేదా తమ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను విమర్శిస్తున్నారా? జీఎస్టీ కొత్త విధానం. సాంకేతిక అంశాల ఆధారంగా పెనుమార్పు తీసుకువచ్చిన విధానం. దీనిపై రాజకీయ దురుద్దేశాలతో విమర్శలు చేయడం సరికాదు. కొందరు చిన్న వ్యాపారుల అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. మా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్‌కు పంపుతున్నాం. అందరం కలిసి పరిష్కరిస్తున్నాం. తాజా ఎన్నికల్లో ఓటమి.. తెలంగాణ, మిజోరంలలో బీజేపీ గెలుస్తుందని ఎవరూ భావించలేదు. ఆ ఆలోచన మాకూ లేదు. మిగతా మూడు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓడిపోయింది. కానీ మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లో హంగ్ అసెంబ్లీ వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ రాష్ట్రాల్లో 15 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అనేది సహజంగానే ఉంటుంది. స్వోత్కర్ష.. వాగాడంబరమే! ప్రధాని ఇంటర్వ్యూపై కాంగ్రెస్, బీజేపీల వాగ్యుద్ధం న్యూఢిల్లీ: మోదీ ఇంటర్వ్యూపై కాంగ్రెస్ స్పందించింది. ఇంటర్వ్యూలో దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను ప్రస్తావించలేదని, కేవలం వాగాడంబరం అందులో ఉంద ని ఆరోపించింది. నోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకు స్కామ్‌లు, రైతాంగ సంక్షోభం.. తదితరాల వల్ల దేశ పౌరులు ఎదుర్కొన్న కష్టనష్టాలపై ప్రధాని మాట్లాడితే బావుండేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా విమర్శించారు. ‘నేను, నా’లకే ప్రధాని ఇంటర్వ్యూ పరిమి తమయిందన్నారు. ఇది ‘ఫిక్స్డ్ ఇంటర్వ్యూ’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రెస్ కాన్ఫెరెన్స్‌ను ఎదుర్కోవాలని సవాలు చేశారు. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు: బీజేపీ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలను ప్రధాని మోదీ చీల్చి చెండాడారని బీజేపీ ప్రశంసించింది. ‘ఇది సమగ్రమైన, అద్భుతమైన ఇంటర్వ్యూ. చాన్నాళ్లుగా వార్తల్లో ఉన్న అనేక అంశాలపై ప్రధాని విస్పష్ట సమాధానం, వివరణ ఇచ్చారు. విపక్ష పార్టీల స్వార్ధ ప్రచారాన్ని ప్రధాని సమర్ధంగా తిప్పికొట్టారు’ అని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ పేర్కొన్నారు. ‘గత కొన్ని నెలలుగా విపక్ష పార్టీలు ప్రణాళికాబద్దంగా ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని, అబద్ధాలను ఒకే ఒక ఇంటర్వ్యూలో ప్రధాని ప్రజలకు తేటతెల్లం చేశారు. నిజం, నిజాయితీకున్న శక్తి ఇదే’ అని మరో నేత షానవాజ్ హుస్సేన్ తెలిపారు. కోర్టు కేసు తేలేవరకు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకు రాబోమని ప్రధాని స్పష్టం చేయడాన్ని జనతాదళ్(యూ) స్వాగతించింది. మోదీ హయాంలోనే రామమందిర నిర్మాణం జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. -
‘బాబ్రీ మసీదు అని పిలవడం కూడా నేరమే’
లక్నో : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే షియా వక్ఫ్ బోర్డ్ చీఫ్ వాసీమ్ రిజ్వీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు అనేది దేశానికి ఒక మచ్చలాంటిదని.. దాన్ని మసీదు అని పిలవడం కూడా నేరమని ఆయన వ్యాఖ్యనించారు. ఈ సందర్భంగా రిజ్వీ మాట్లాడుతూ ‘ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో తవ్వకాలు జరిపినప్పుడు చదరపు ఆకారంలో ఉన్న 50 స్తంభాలతో నిర్మితమైన ఆలయం బయటపడింది. ఆలయానికి సంబంధించి మొత్తం 265 అవశేషాలు బయటపడ్డాయి. దాదాపు 137 మంది ఇక్కడ తవ్వకాలు జరిపారు. వీరిలో 52 మంది ముస్లీంలు ఉన్నార’ని తెలిపారు. అంతేకాక బాబ్రీ మసీదు కింద ఆలయం ఉందని.. దాన్ని కూలదోసి అక్కడ మసీదు నిర్మించారని భారత పురావస్తు శాఖ కూడా నిర్ధారించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రిజ్వీ కేకే మహ్మద్ రాసిన ‘ఐ యామ్ ఇండియన్’ పుస్తకాన్ని ప్రస్తావించారు. ఈ పుస్తకంలో ‘ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న చోట ఆలయాలు ఉండేవాని.. వాటిని నాశనం చేసి ఆ శిధిలాల మీదనే బాబ్రీ మసీదును నిర్మించిరాని’ రచయిత కేకే మహ్మద్ తన పుస్తకంలో రచించినట్లు రిజ్వీ తెలిపారు. అంతేకాక ఈ బాబ్రీ మసీదు విషయంలో హిందువులు - ముస్లీంలు ఓ అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న చోట రామాలయం నిర్మించే హక్కు హిందువులకు ఉన్నదని ఆయన తెలిపారు. ముస్లింలు లక్నోలోని మరో ప్రాంతంలో మసీదు నిర్మించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాక బాబ్రీని మసీదు అని పిలవడం ముస్లిం సాంప్రదాయలకు విరుద్ధం అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా రిజ్వీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ‘అయోధ్యలో మసీదు ఉండటానికి అవకాశమే లేదు. ఇది రామ జన్మభూమి.. ఇక్కడ రామాలయం మాత్రమే ఉండాలి.. మసీదు కాద’ని తెలిపారు. -
మోదీపై తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల ఓట్లతో గెలిచి, ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రస్తుతం ముస్లిం మహిళల తరపు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారంటూ విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం వర్గం వ్యక్తిగత అంశమని.. ఆ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవాదం, హిందుత్వ నినాదాలతో అధికారంలోకి వచ్చిన మోదీ.. హిందూ దేశాన్ని, కశ్మీర్లో ఉన్న హిందువులను రక్షించాల్సిందిపోయి ముస్లింల వకాల్తాదారుగా వ్యవహరించడం బాగోలేదంటూ విమర్శించారు. బీజేపీనా.. మినీ కాంగ్రెస్ పార్టీయా మథురలో జరగిన ఓ సమావేశానికి హాజరైన తొగాడియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్న వారంతా బీజేపీని మినీ కాంగ్రెస్ పార్టీగా మారుస్తున్నారని ఆరోపించారు. అందుకే బీజీపీ హిందువుల సంక్షేమం గురించి పట్టించుకోవడం మానేసి ముస్లింల జపం చేస్తుందంటూ విమర్శించారు. మోదీ ప్రభుత్వం గోరక్షకులను గూండాలుగా.. గూండాలను(మాజీ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి) సోదరులుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉండి కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టకపోవడం కేంద్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని తొగాడియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా సింహాసనం ఎక్కేందుకే మోదీ రాముడి పేరు వాడుకున్నారని.. అధికారంలోకి రాగానే అసలు విషయం పక్కనపెట్టేశాని ఘాటుగా విమర్శించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ జెండా ఎగురుతున్నా హిందువులకు ఏమాత్రం న్యాయం జరగడం లేదని తొగాడియా ఆవేదన వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణం విషయంలో వీహెచ్‌పీ అధ్యక్షుడిగా తన శాయశక్తులా ప్రయత్నించిన లాభం లేకపోయిందని వాపోయారు. -
బాబ్రీ విధ్వంసానికి పది కారణాలు
సాక్షి, న్యూఢిల్లీ : నేటికి సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం అంటే, 1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసిన పరిస్థితులు, వైఫల్యాలు, బాధ్యులను పది అంకెల్లో పేర్కొనవచ్చు! 1. ఎల్కే అద్వానీ 1990, సెప్టెంబర్ 25 తేదీన భారతీయ జనతా పార్టీ ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్ర బాబ్రీ మసీదు విధ్వంసానికి బీజం వేసింది. ఆయన రథ యాత్ర పలు రాష్ట్రాల్లో హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలను పెంచి అల్లర్లకు దారితీసింది. పైగా అద్వానీ బాబ్రీ మసీదు విధ్వంసం రోజున అక్కడే వేదికపై ఉన్నారు. ఆయన పక్కన పార్టీ సహచరులు మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలు ఉన్నారు. వారంతా బాబ్రీ విధ్వంసానికి కరసేవకులను ప్రోత్సహించారనే అభియోగాలు ఉన్నాయి. ఆ తర్వాత 1992, డిసెంబర్ 6వ తేదీన తన జీవితంలో అత్యంత చీకటి రోజని అద్వానీ బాధను వ్యక్తం చేశారు. ఆ బాధ నిజంగా కలిగిందా, ఆత్మవంచనా ? ఆయనకే తెలియాలి. 2. ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషద్, బజరంగ్ దళ్ ఈ సంఘాలు హిందూ, ముస్లింలు, క్రైస్తవుల మధ్య వైషమ్యాలనే సష్టించడమే కాకుండా బాబ్రీ మసీదు విధ్వంసానికి కార్యకర్తలను తరలించాయి. సాధ్వీ రిదంబర లాంటి వారు వారిలో మరింత ఆజ్యం పోశారు. ‘కహో గర్వ్‌సే హమ్ హిందూ హై, హిందుస్థాన్ హమారా హై, జో హమ్సే టక్రాయేగా, వో కుత్తేకి మౌత్ యహాపర్ దేకో మారా జాయేగా, జహా బనీ హై మసీద్, అప్నా మందిర్ వహీ బనాయింగే. బాబర్ కే హౌలాదోం, జావో పాకిస్థాన్, యా కబరిస్థాన్’ అంటూ ఆమె రెచ్చగొట్టారు. 3. పీవీ నర్సింహారావు అప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు బాబ్రీ మసీదును రక్షించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి ఉండగా, అలా చేయలేదు. జన నష్టం ఎక్కువ జరుగుతుందంటూ సాకు చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తనకిచ్చిన మాట తప్పారంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. రామ మందిరాన్ని కోరుకుంటున్న కళ్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు విధ్వంసం కాకుండా అడ్డుకుంటారని అనుకున్నాననడం అర్థరహితం. 1984లో ఢిల్లీలో సిక్కుల అల్లర్లు చెలరేగినప్పుడు కూడా వాటిని నిరోధించడంలో పీవీ విఫలం అయ్యారు. 4. కళ్యాణ్ సింగ్ ఆయన బాబ్రీ మసీదును విధ్వంసం నుంచి రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన తన బీజేపీ పార్టీతోపాటు తాను మసీదు విధ్వంసాన్ని కోరుకున్నారు. శక్తివంచన లేకుండా మసీదును పరిరక్షించేందుకు ప్రయత్నించానని చెప్పుకున్నారు. 5. శివసేన బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం ముంబైలో చెలరేగిన అల్లర్లకు శివసేనదే బాధ్యత. ఆ పార్టీ నాయకుడు తన పత్రిక ‘సామ్నా’ద్వారా అల్లర్లను ప్రేరేపించారు. నాటి అల్లర్లలో వందలాది మంది మరణించారు. శ్రీకష్ణ కమిషన్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. 6. పోలీసులు, భద్రతా దళాల వైఫల్యం అయోధ్యలో బాబ్రీ మసీదు వద్ద భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు, భద్రతా బలగాలు కరసేవకులకు భయపడి పారిపోయారు. ముంబైలో హిందూ మూకలు అల్లర్లకు పాల్పడుతుంటే కూడా మౌన ప్రేక్షకుల్లా ఉండిపోయారు. 7. కాంగ్రెస్ పార్టీ 1992, 1993లలో ఇటు కేంద్రంలో, అటు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాబ్రీ మసీదును రక్షించడంలో, ముంబై అల్లర్లను నిరోధించడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం అల్లర్లపై శ్రీకష్ణ కమిషన్‌ను వేసింది. ఆ కమిషన్ నివేదికపై కఠన చర్యలు తీసుకుంటానని ఎన్నికల మేనిఫెస్టోలో పదేపదే హామీ ఇచ్చి కూడా ఎన్నడూ ఎలాంటి చర్య తీసుకోలేదు. 8. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త విజ్ఞానం ప్రాతిపదికన వ్యవహరించాల్సిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా హిందూత్వ ఎజెండాకే మద్దతు పలికింది. పుక్కిటి పురాణాల్లో ఉన్న సరస్వతి నదికి, సింధూ నాగరికతకు లింకు ఉందని చెప్పింది. పెద్దగా తవ్వకాలు జరపకుండానే బాబ్రీ మసీదు కింద రామాలయం ఉందని తేల్చింది. 9. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ బాబ్రీ మసీదు విధ్వంసంపై 1992లోనే దర్యాప్తునకు లిబర్హాన్ కమిషన్‌ను వేశారు. అది 17 సంవత్సరాల తర్వాత, అంటే 2009లో నివేదికను సమర్పించింది. ఇంతటి ఆలస్యానికి అర్థం ఏమైనా ఉందా? 1993, అక్టోబర్‌లో సీబీఐ అద్వానీ, మురళీ మనోహర్, ఉమా భారతి సహా 21 మంది నిందితులపై బాబ్రీ విధ్వంసం కుట్రకేసును నమోదు చేసింది. ఈ కేసును సాంకేతిక కారణాలను చూపిస్తూ 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. తిరిగి ఈ కేసును 2017లో సుప్రీం కోర్టు పునరుద్ధరించింది. 21 మంది నిందితుల్లో ఇప్పటికే 8 మంది నిందితులు మరణించారు. 10. సుప్రీం కోర్టు బాబ్రీ విధ్వంసం కేసుకన్నా బాబ్రీ మసీదు వివాదం ఎన్నో ఏళ్లుగా అంటే, దాదాపు ఏడు దశాబ్దాలుగా సుప్రీం కోర్టులో నలుగుతోంది. ఇరుపక్షాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ సూచించడం తప్పా వివాదాన్ని పరిష్కరించలేకపోయింది. భూ వివాదానికి సంబంధించిన ఈ కేసు తుది విచారణను మళ్లీ ఫిబ్రవరికి వాయిదా వేసింది. -
రామ మందిరంతో 2019లో గెలవడానికా..?
హైదరాబాద్ : రామ మందిరం సమస్యను అడ్డుపెట్టుకుని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని 2019లో రక్షించాలని సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందని ఎంఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, బీజేపీలు రామ మందిరం సమస్యతో పబ్బం గడుపుకోవాలని భావిస్తున్నారని అన్నారు. సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ వాదనను సమర్థించారు. ఓ వీహెపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌లు అక్టోబర్ 2018లో రామ మందిరం నిర్మాణం అవుతుందని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ముస్లింలను రెచ్చగొట్టి.. పబ్బం గడుపుకోవాలని వారు భావిస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు కల్పించడం, రైతుల ఆత్మహత్యలను ఆపడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీలు పేదవాడిని మరింత కుంగదీశాయని చెప్పారు. ఇలాంటి సమస్యల నడుమ ఎన్నికలు జరగాలే గానీ.. రామ మందిరం సమస్యతో కాదని అన్నారు. సుప్రీం కోర్టులో సిబాల్ వాదనపై ఓ సెక్షన్ మీడియా క్రిటిసైజ్ చేస్తూ వార్తలు రాసిందని చెప్పారు. క్లయింట్‌ను దృష్టిలో ఉంచుకుని ఓ లాయర్ తన వాదనలను వినిపిస్తారనే మాటను మర్చిపోకూడదన్నారు. -
అయోధ్యలో రామ మందిరమే
సాక్షి, బెంగళూరు: అయోధ్యలో రామమందిరం మాత్రమే ఉండాలనీ, అక్కడ మరే నిర్మాణానికీ తాము అంగీకరించబోమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ శుక్రవారం స్పష్టం చేశారు. కర్ణాటకలోని ఉడుపిలో శుక్రవారం ప్రారంభమైన మూడురోజుల ‘ధర్మసంసద్’లో ఆయన మాట్లాడుతూ ‘బాబ్రీ మసీదు ధ్వంసమై పాతికేళ్లు అవుతోంది. ఇంకా మనం వేచి చూడటంలో అర్థం లేదు. సంఘ్ పరివార్ సేవకులు రామ మందిర నిర్మాణం ఎప్పుడని అడుగుతున్నారు. రెండేళ్లలో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరతాం. అక్కడ రామాలయం తప్ప మరే కట్టడాలు ఉండేందుకు వీల్లేదు’ అని పేర్కొన్నారు. మత మార్పిడులపై ఆరెస్సెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘మౌర్య సుప్రీం ఆదేశాలు ఉల్లంఘించారు’
న్యూఢిల్లీ: రామమందిరం నిర్మాణం అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చిన ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్యపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాలను సైతం దిక్కరించి ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు కేశవ్ దిగారని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. గతంలో మతం పేరిట ఏ రాజకీయ పార్టీ కూడా ఓట్లు అడగరాదని, ఎన్నికల ప్రచారం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ ఆదేశాలను భేఖాతరు చేస్తూ బీజేపీ నేత మతపరమైన అంశాన్ని లేవనెత్తారని పేర్కొంది. ఈ సందర్భంగా లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ కాంగ్రెస్ కార్యదర్శి కె.సి మిట్టల్ ఎన్నికల కమిషన్ చీఫ్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీకి ఉన్న కమలం గుర్తును తొలగించాలని చెప్పారు. ఫిర్యాదు అనంతరం మిట్టల్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో కులం, మతాలను వాడుకోవడం పై ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నాంది పలకాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చాక రామమందిరం నిర్మిస్తామని అంతకుముందు బీజేపీ రాష్ట్ర చీఫ్ మౌర్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
‘రామ మందిరంపై మోసం చేయొద్దు’
అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చట్టాన్ని తీసుకురావడంపై అశక్తతను వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌పై హిందూ ఆధ్యాత్మిక నేతలు మండిపడుతున్నారు. రామ మందిరం నిర్మిస్తామని ఎన్నికల ముందు బీజేపీ హామీ ఇచ్చిందని, నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేయవద్దంటున్నారు. ఎన్డీఏకు రాజ్యసభలో మెజారిటీ లేదని, రామమందిరంపై ప్రస్తుతం ఏమీ చేయలేమని ఆయన ఇటీవల పేర్కొన్నారు. ‘‘అధికారంలోకి వస్తే మందిర నిర్మాణానికి చట్టాన్ని తీసుకువస్తామన్న హామీని రాజ్‌నాథ్‌సింగ్ నిలబెట్టుకోవాలి’’ అని అని రామ జన్మభూమి న్యాస్ సభ్యుడు రాం విలాస్ వేదాంతి పేర్కొన్నారు.