సాక్షి, హైదరాబాద్ : వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయోధ్య రామ జన్మభూమిపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వివాదం లేని 67 ఎకరాల భూమిని రామజన్మభూమి ట్రస్ట్‌కు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొంది.
రామ జన్మభూమి-మసీదు వివాదాస్పద ప్రాంతం 2.77ఎకరాలు కాగా 1991లో ప్రభుత్వం దాంతోపాటు వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ 67 ఎకరాల భూమిలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేపట్టరాదని గతంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తొలగించి యజమానులకు 67 ఎకరాల భూమిని అప్పగించాలని సుప్రీం కోర్టుకు కేంద్రం ప్రభుత్వం విన్నవించింది.
Comments
Please login to add a commentAdd a comment