లాక్‌డౌన్‌ పొడిగింపు: మతలబు ఇదేనా ! | Over 3 Lakh People In Quarantine Nationwide | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ పొడిగింపుకు అసలు కారణం ఇదేనా..!

Published Tue, Apr 14 2020 7:37 PM | Last Updated on Tue, Apr 14 2020 9:15 PM

Over 3 Lakh People In Quarantine Nationwide - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తోంది. కేంద్ర హోంశాఖ అధికారుల సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా బాధితులు క్వారెంటైన్‌ కేంద్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా వ్యాప్తి కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం దేశ వ్యాప్తంగా 3,23,00 మందిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచినట్లు కేంద్ర హోంశాఖకు చెందిన ఓ ముఖ్య అధికారి వెల్లడించారు.

అత్యధికంగా మహారాష్ట్రంలో 66వేల మంది, ఉత్తరాఖండ్‌లో 55వేలు, రాజస్తాన్‌ 35,841, ఉత్తరప్రదేశ్‌ 31,158, గుజరాత్‌ 14,204, బిహార్‌లో 11,998 మందిని హోం క్వారెంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలోనే కరోనా బాధితులు క్వారెంటైన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.  దేశంలోని మొత్తం 718 జిల్లాల్లో దాదాపు 370 జిల్లాకు పైగా కరోనా బారిన పడ్డయని హోంశాఖ నివేదికలో తేలింది. ఈ సమాచారం ఆధారంగానే ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు తెలుస్తోంది.

మరోవైపు దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 10,363 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 339కి చేరింది. ఇక ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ చివరి తేదిగా ప్రకటించినా.. పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో మరోరెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement