న్యూఢిల్లీ: చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పోస్టుల్లో దేశవ్యాప్తంగా 30 శాతానికిపైగా ఖాళీగా ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ బుధవారం విడుదల చేసిన ఓ నివేదికలో ఈ వివరాలున్నాయి. సమాచార హక్కు చట్టం–2005 కింద సమాచారం ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 2.5 కోట్ల ఆర్టీఐ దరఖాస్తులు వచ్చాయని నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 156 చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పోస్టుల్లో 48 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్‌లో 30.8% పోస్టులు ఇంకా భర్తీకాలేదు. ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. 2005–16లో బాధ్యతారాహిత్యానికి సంబంధించి వేర్వేరు ప్రభుత్వ సం స్థలు, అధికారులపై సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రూ.1.93 కోట్ల జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment