
ముంబై: ఆత్మాహుతి దాడితో భారత ప్రధాని నరేంద్ర మోదీని అంతం చేస్తానంటూ బెదిరించిన పాకిస్తాన్ పాప్ సింగర్ రబీ పిర్జాదా నగ్న వీడియో సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. ఈ వీడియో లీక్ అవ్వడంతో ఆమె వినోదరంగం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. పలువురు నెటిజన్లు ఐయామ్ రబీ పీర్జాదా (#iamrabipeerzada) హ్యాష్‌ట్యాగ్‌తో తమ న్యూడ్, సెమీ న్యూడ్ ఫొటోలు పోస్ట్ చేశారు. తాజాగా రబీ పీర్జాదాకు మద్దతుగా ముంబైకి చెందిన పాక్-అఫ్ఘానిస్తాన్ సంతతి నటి మలీషా హీనా ఖాన్ ట్విటర్‌లో నగ్న ఫొటోలు పోస్టు చేశారు.
మలీషా ట్విటర్ ఖాతా కొద్ది గంటల ముందే క్రియేట్ అయింది. తన ఖాతాను ప్రారంభించిన వెంటనే ఆమె రబీకి మద్దతుగా పలు న్యూడ్ ఫొటోలు పోస్ట్‌చేశారు. తాను నటిని, సింగర్‌ని, మోడల్‌ని అంటూ ఖాతాలో వ్యక్తిగత వివరాలు వెల్లడించిన ఆమె.. రబీకి మద్దతుగా పలు హ్యాష్‌ట్యాగులు జోడించారు. నగ్న వీడియో, ఫొటోలు విడుదల కావడంతో ఈ నెల 5న వినోద రంగం నుంచి తప్పుకుంటున్నట్టు రబీ పీర్జాదా వెల్లడించారు. ఆమె నగ్న వీడియో ఈ నెల 1న ఆన్‌లైన్‌లో లీక్ అయింది. దీని వెనుక పాక్ ఆర్మీలోని పీఆర్ విభాగాధిపతి ఆసిఫ్ గఫూర్ హస్తం ఉన్నట్లు అప్పట్లో నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు.
చదవండి: పాక్ సింగర్ నగ్న వీడియో లీక్; పాక్ ఆర్మీ హస్తం?
Comments
Please login to add a commentAdd a comment