వాషింగ్టన్ : ఉత్తర కొరియా కంటే పాకిస్తానే అత్యంత ప్రమాదకారి అని.. అమెరికా మాజీ సెనెటర్ ఒకరు హెచ్చరించారు. అణుబాంబులపై పాకిస్తాన్‌లో కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థలేదని.. దీని వల్ల ప్రపంచానికి పెనుముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్‌లో అణ్వాయుధాలను దొంగిలించి.. ఇతర దేశాలకు, ఉగ్రవాదులకు అమ్ముకునే అవకాశం ఉందని అమెరికా సెనేట్ ఆయుధ నియంత్రణ సబ్ కమిటీ మాజీ ఛైర్మన్ ల్యారీ ప్రెస్లర్ స్పష్టం చేశారు.
పాకిస్తాన్‌లోని అణ్వాయుధాలను సైన్యం నుంచి ఉగ్రవాదులు కొనుగోలు చేసి అమెరికా మీదే ప్రయోగించే అవకాశం లేకపోలేదన్నారు. అమెరికానేకాక మొత్తం ప్రపంచాన్నే భయపెట్టే అంశం ఇదేనన్నారు. ఈ కారణాల వల్లే.. పాకిస్తాన్‌కు అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాల అమ్మకాలను అమెరికా నిలిపివేసిందని ఆయన చెప్పారు. భారత్‌కు అమెరికా దగ్గరకావడానికి ఇదొక కారణని ఆయన అన్నారు. అణ్వాయుధాలపై నియంత్రణ లేని పాకిస్తాన్.. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశమని లారీప్రెస్లర్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment