పాక్ ప్రభుత్వ సైట్లపై భారత హ్యాకర్ల సైబర్ స్ట్రైక్స్ | pakistani government sites locked by indian hackers cyber strikes | Sakshi
Sakshi News home page

పాక్ ప్రభుత్వ సైట్లపై భారత హ్యాకర్ల సైబర్ స్ట్రైక్స్

Published Fri, Oct 7 2016 11:11 AM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM

పాక్ ప్రభుత్వ సైట్లపై భారత హ్యాకర్ల సైబర్ స్ట్రైక్స్ - Sakshi

పాక్ ప్రభుత్వ సైట్లపై భారత హ్యాకర్ల సైబర్ స్ట్రైక్స్

భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడితే.. తాము సైబర్ స్ట్రైక్స్‌తో విధ్వంసం సృష్టిస్తామంటున్నారు భారత హ్యాకర్లు. పాకిస్థానీ ప్రభుత్వ నెట్‌వర్క్‌లోకి సమర్థంగా ప్రవేశించిన హ్యాకర్లు వాళ్ల కంప్యూటర్లు, డేటా మొత్తాన్ని లాక్ చేసేస్తున్నారు. దాంతో ఏం చేయాలో తెలియక పాక్ సైబర్ నిపుణులు తల పట్టుకుంటున్నారు. చివరకు తమ కంప్యూటర్లను అన్‌లాక్ చేస్తే భారీ మొత్తం ఇస్తామని భారత హ్యాకర్లకు వాళ్లు ఆఫర్లు ఇచ్చినా.. దేశభక్తి మెండుగా ఉన్న ఈ హ్యాకర్లు ససేమిరా అంటూ వాళ్ల ఆఫర్లను తిరస్కరించారు.

ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఇటీవల పాకిస్థానీ హ్యాకర్లు కొందరు భారతీయ సైట్లలో కొన్నింటిని హ్యాక్ చేసి, వాటిలో తమ దేశభక్తి గీతాలను పోస్ట్ చేయడంతో భారతీయ హ్యాకర్లకు ఒళ్లు మండింది. పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు.. పాక్ ప్రభుత్వ సైట్లేవీ అసలు పనిచేయకుండా చేసేశారు. వాళ్ల నెట్‌వర్క్ మొత్తాన్ని ఆపేసేందుకు రాన్సమ్‌వేర్‌ను చొప్పించారు. 'తెలంగాణ సైబర్ వారియర్' అనే పేరుతో ఉన్న ఒక హ్యాకర్ కూడా ఇలా పాకిస్థానీ ప్రభుత్వ సైట్లను హ్యాక్ చేసినవారిలో ఉన్నట్లు తెలిసింది. అసలు పాకిస్థాన్ సైబర్ స్పేస్ మొత్తాన్నే సర్వనాశనం చేసే శక్తి కూడా భారతీయ హ్యాకర్లకు ఉందని కొందరు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement