సదానందగౌడ్తో పాల్వాయి, రాపోలు భేటీ | palvai govardhan reddy and rapolu anand bhaskar meeting with d v sadananda gowda | Sakshi
Sakshi News home page

సదానందగౌడ్తో పాల్వాయి, రాపోలు భేటీ

Published Wed, Jun 29 2016 10:50 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

palvai govardhan reddy and rapolu anand bhaskar meeting with d v sadananda gowda

న్యూఢిల్లీ : న్యాయాధికారుల సమస్య గురించి గవర్నర్తో మాట్లాడతానని కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వి. సదానందగౌడ హామీ ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రాపోలు ఆనంద్ భాస్కర్ వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి సదానందగౌడను సదరు ఎంపీలు కలిసిశారు. తెలంగాణ న్యాయధికారులు, న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా సదానందగౌడకి వారు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వాన్ని పాల్వాయి, రాపోలు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement