Minister of Law and Justice
-
విశాఖలో ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయండి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని నగరం అయిన విశాఖపట్నంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) బెంచ్‌ను ఏర్పాటు చేయవలసిందిగా రాజ్యసభ జీరో అవర్‌లో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల్లో తలెత్తే వివాదాలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 323 (ఏ) కింద ప్రతి రాష్ట్రంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ బెంచ్ ఏర్పాటు జరుగుతుందని విజయసాయి రెడ్డి చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో క్యాట్ ఏర్పాటు జరగలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 50 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో 60 శాతం మంది విశాఖపట్నంలోనే పని చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో క్యాట్ బెంచ్ లేనందున పిటిషనర్లు తమ వివాదాల పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్‌కు ప్రయాణం చే వస్తోంది. వ్యయ ప్రయాసలతో కూడిన ప్రయాణాల వలన ఉద్యోగులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. (భూ దోపిడీపై నిగ్గు తేల్చండి) విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్, కస్టమ్స్, పోర్టు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, రైల్వేస్, ఎయిర్పోర్ట్, హెచ్‌పీసీఎల్, ఎల్ఐసీ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందువలన ఉద్యోగుల సౌలభ్యం కోసం చైర్మన్, సభ్యులతో కూడిన క్యాట్ బెంచ్‌ను విశాఖపట్నంలో నెలకొల్పవలసిందిగా విజయసాయి రెడ్డి న్యాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. (రాజ్యసభలో విశాఖ వాణి) విశాఖలో ట్రిపుల్ ఐటీని నెలకొల్పాలి అత్యధిక జనాభా కలిగి పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో ట్రిపుల్ ఐటీని నెలకొల్పాలని రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ మంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఏయూలో తాత్కాలిక భవనాల్లో పనిచేస్తున్న ఐఐఎంకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. -
సదానందగౌడ్‌తో పాల్వాయి, రాపోలు భేటీ
న్యూఢిల్లీ : న్యాయాధికారుల సమస్య గురించి గవర్నర్‌తో మాట్లాడతానని కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వి. సదానందగౌడ హామీ ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రాపోలు ఆనంద్ భాస్కర్ వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి సదానందగౌడను సదరు ఎంపీలు కలిసిశారు. తెలంగాణ న్యాయధికారులు, న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా సదానందగౌడకి వారు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వాన్ని పాల్వాయి, రాపోలు డిమాండ్ చేశారు. -
'సెక్షన్ - 26 సవరణపై కేంద్రమంత్రితో చర్చించా'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలు...హైకోర్టు ఏర్పాటు... హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తుల వాటా.. తదితర అంశాలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడతో చర్చించినట్లు కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి సదానందగౌడతో వినోద్‌కుమార్ భేటీ అయ్యారు. అనంతరం వినోద్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.... విభజన చట్టంలోని సెక్షన్ - 26లో చేయవలసిన చిన్నపాటి సవరణపై కూడా మంత్రితో చర్చించినట్లు చెప్పారు. ఈ సెక్షన్లో చేసే సవరణ ద్వారా రాష్ట్ర అసెంబ్లీలో స్థానాలు పెంచేందుకు అవకాశం ఉందన్నారు. ఇదే సవరణపై సదానందగౌడకు గతంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు లేఖ రాసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే దశలో ఉందన్నారు. ఈ బిల్లు తయారీపై కేంద్ర హోంశాఖ, న్యాయశాఖకు తమ అభిప్రాయాలను పంపించిందని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ సవరణ బిల్లు వచ్చేలా అందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని మంత్రి సదానంద గౌడని కోరినట్లు చెప్పారు. ఒకటిరెండు రోజుల్లో తమ శాఖ నుంచి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తనకు హామీ ఇచ్చారన్నారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో 450 మంది న్యాయమూర్తులు ఉన్న విషయాన్ని కూడా ఆయనతో ప్రస్తావించారన్నారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఉన్నందున న్యాయమూర్తుల ఎంపికలో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై చర్చించినట్లు చెప్పారు. ఉమ్మడి హైకోర్టులో 42 శాతం తెలంగాణ న్యాయమూర్తుల ఎంపిక జరగాలని కోరినట్లు తెలిపారు. 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో న్యాయ శాఖలో జరిగిన అన్యాయం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక జరుగవద్దు అన్నదే తమ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని సదానంద గౌడ ఎదుట వివరించినట్లు చెప్పారు. ఇదే విధంగా లోయర్ జ్యూడిషియరీ నుంచి జరిగే ఎంపికలో తెలంగాణ వాటా ఉండాలని మంత్రికి వివరించానన్నారు. ఈ అంశాలపై హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో తప్పకుండా మాట్లాడుతానని మంత్రి హామీ ఇచ్చారు హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టులో అప్పిల్ చేస్తే బాగుంటుందని మంత్రి సూచించారన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.