చిలుక నిర్ణయం: యాజమాని‌ షాక్‌! | Parrot Choose Independence Instead Of Owner | Sakshi
Sakshi News home page

యాజమాని వద్దు! స్వేచ్ఛే ముద్దు

Published Thu, May 7 2020 3:41 PM | Last Updated on Thu, May 7 2020 3:49 PM

Parrot Choose Independence Instead Of Owner - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో : ఓ చిలుక తీసుకున్న నిర్ణయానికి దాని యాజమాని షాక్‌ తిన్నాడు. తనను కాదని వెళ్లి పోవటంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్నోకు చెందిన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రామ్‌ క్రిపాల్‌ ఓ చిలుకను పెంచుకుంటున్నాడు. గత మంగళవారం ఆ చిలుక కనిపించకుండా పోయింది. అయితే ఎదురింటికి చెందిన వాళ్లు తన చిలుకను దొంగిలించారన్న అనుమానంతో వారిని నిలదీశాడు క్రిపాల్‌. తాము ఏ చిలుకనూ దొంగలించలేదని, ఆ చిలుక తాము పెంచుకుంటున్నదేనని వాళ్లు చెప్పారు. దీంతో ఈ సమస్య ఏషియానా పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ ఈ సమస్యను అ‍క్బర్‌-బీర్బల్‌ కథలోలా తెలివిగా పరిష్కరించాలని భావించాడు. ( ఏటీఎమ్ చోరీకి య‌త్నించిన‌ కోతి )

పంజరాన్ని తెరిచినపుడు చిలుక యాజమాని దగ్గరకు వెళుతుందని, తద్వారా యాజమాని ఎవరో తెలుస్తుందని అనుకున్నాడు. ఈ విషయం వాళ్లకు చెప్పి, యాజమాని దగ్గరకు వెళ్లమని చిలుక పంజరాన్ని తెరిచాడు. అయితే ఆ చిలుక నిజమైన యాజమానికి కూడా షాక్‌ ఇస్తూ.. పంజరంలోంచి బయటకు రాగానే అక్కడినుంచి తుర్రుమని ఎగిరిపోయింది. చేసేదేమి లేక ఆ ఇద్దరు నిరాశతో ఇళ్లకు వెళ్లిపోయారు. ( ఈ రెండూ ఉంటే చాలు.. గులాబ్‌ జామూన్‌ రెడీ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement