ప్లాస్టిక్‌ కాలుష్యానికి బయో ప్లాస్టిక్‌ సమాధానమా ? | Plastic Makes Over Pollution | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ కాలుష్యానికి బయో ప్లాస్టిక్‌ సమాధానమా ?

Published Sun, Jun 10 2018 11:36 PM | Last Updated on Mon, Jun 11 2018 11:16 AM

Plastic Makes Over Pollution - Sakshi

ప్రస్తుతం రోజువారి జీవితంలో ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు చర్చనీయాంశమయ్యాయి. వివిధ రూపాల్లో ప్లాస్టిక్‌ సంచుల ఉపయోగాన్ని తిరస్కరించాలనే పాత డిమాండ్‌ ఓ వైపు కొనసాగుతున్న కేవలం ఓ సారి వినియోగానికే ఉద్ధేశించిన ప్లాస్టిక్‌ నియంత్రణకు ఇప్పుడు ప్రాధాన్యం ఏర్పడింది. బయో డీగ్రేడబుల్‌ లేదా బయో ప్లాస్టిక్స్‌ వినియోగానికి మధ్యతరగతి మొగ్గుచూపుతోంది. వీటిని మొక్కలు, తదితర పదార్థాలు ఉపయోగించి తయారు చేయడం వల్ల శుద్ధి చేసేందుకు లేదా తిరిగి ఉపయోగించేందుకు ఇవి కలిసొస్తాయి. అంతేకాకుండా తక్కువ కాలుష్యానికి కూడా ఇవి కారణమవుతాయి. భారత్‌లో వీటి వినియోగం ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్టుగా చెబుతున్నారు. 

కొన్ని సింగిల్‌ యూస్‌’ (ఒకేసారి వినియోగం) ప్లాస్టిక్స్‌కు కూడా ప్రత్యామ్నాయాలున్నాయి. తినుబంఢారాలు లేదా పానీయాల కోసం ఉపయోగించే ప్లాస్టిక్‌ సాఛెట్లకు బదులు సీసంతో కూడిన వస్తువులు ఉపయోగించవచ్చు . స్టయిరోఫోమ్‌ ప్లేట్లకు బదులు ఆకులు, బయోమాస్‌తో తయారు చేసిన పళ్లాలు వాడవచ్చు. చెత్తబుట్టల్లో వ్యర్థాలు వేసేందుకు ఉపయోగించే ‘ప్లాస్టిక్‌ బిన్‌ లైనర్లు’ బయో ప్లాస్టిక్స్‌లో అత్యధిక ఆదరణ పొందిన రకాలుగా నిలిచాయి.  వీటి కోసం డిమాండ్‌ కూడా ఎక్కువగా ఉంది. 

బయోప్లాస్టిక్స్‌ ఎన్ని రకాలు...
వివిధ రూపాల్లో   నశించేందుకు (డీగ్రేడ్‌) వీలుగా బయోప్లాస్టిక్స్‌ రూపొందినట్టు చెబుతుంటారు. అయితే వాటిలో ఎరువుగా (కంపోస్ట్‌) మారేవిగా మార్కెట్‌ చేస్తున్నవీ ఉన్నాయి. ఫోటో డీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ అనేది మరో బయోప్లాస్టిక్‌గా గుర్తింపు పొందింది. సూర్యక్రాంతి తగిలితే క్రమంగా క్రమంగా క్షీణించే విధంగా వీటిని తయారుచేశారు. నీరు తగిలితే అతి చిన్న చిన్న ముక్కలుగా (2 మిల్లీమీటర్ల కంటే చిన్నగా) విడిపోయేలా బయోడీగ్రేడబుల్‌గా రూపొందించినవి ఉన్నాయి. 

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు చూడడం కంటే ఆధునిక జీవనశైలిలో భాగంగా అనుసరిస్తున్న విధానాలు, కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించే దిశలో చర్యలు తీసుకుంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే బయో ప్లాస్టిక్స్‌లో కొంతలో కొంతైన పరిస్థితిలో మార్పు వస్తుందని సూచిస్తున్నారు. 
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement