
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి గురించి సమాచారాన్ని, నిపుణుల అభిప్రాయాలను ప్రజలకు చేరవేయాలని, ప్రజలు ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు, కష్టాలపై అభిప్రాయాలు అందించాలని ప్రధాని నరేంద్రమోదీ రేడియో జాకీలకు పిలుపునిచ్చారు. వైరస్‌నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను కూడా తెలియజేయాలని కోరారు. శుక్రవారం ప్రధాని రేడియో జాకీలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజల కోసం పాటు పడుతున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో దురుసుగా, అనుచితంగా ప్రవర్తించిన ఘటనలపై అవగాహన కల్పి ంచాలని, తద్వారా వాటిని అధిగమించొచ్చన్నారు. అదేవిధంగా, కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై ప్రతిరోజూ నివేదికలు ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం మంత్రులకు ఆదేశాలిచ్చింది.