జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లోను ఐదు విడతలుగా ఎన్నికలను నిర్వహించారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటివరకు అందుతున్న వివరాల ప్రకారం బీజేపీ ఆధిక్యం కనపడుతోంది.
జార్ఖండ్లో 7 చోట్ల బీజేపీ, ఒకచోట కాంగ్రెస్, 2 చోట్ల జేఎంఎం ఆధిక్యం కనబరుస్తున్నాయి. మరోవైపు కశ్మీర్లో మాత్రం ముందునుంచి అనుకున్నట్లే పీడీపీ కొంత ముందంజలో ఉంది. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో 11 స్థానాల్లో పీడీపీ, 5 చోట్ల బీజేపీ, 2 చోట్ల కాంగ్రెస్, 1 చోట నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యంలో ఉన్నాయి.
ఓట్ల లెక్కింపు ప్రారంభం; బీజేపీ ఆధిక్యం
Published Tue, Dec 23 2014 8:29 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement
Advertisement