
రేపు కంచికి రాష్ట్రపతి
సాక్షి, చెన్నై: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం దైవ దర్శనార్థం తమిళనాడులోని కంచికి రానున్నారు. ఒకే రోజు అక్కడున్న అన్ని ఆలయాల్ని సందర్శించనున్నారు. గత నెల కాంచీపురానికి రావాల్సి ఉన్నా, చివరి క్షణంలో రాష్ట్రపతి పర్యట న రద్దయింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం కాంచీపురం పర్యటనకు ప్రణబ్ రానున్నారు.