
యూపీ కాంగ్రెస్ వ్యూహాత్మక భేటీలో ప్రియాంక
న్యూఢిల్లీ: అధికార ఎస్పీలో అంతర్గత సంక్షోభం నెలకొన్న తరుణంలో యూపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ సోమవారం నిర్వహించిన సమావేశానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ హాజరయ్యారు.
గులాంనబీ ఆజాద్ ఏర్పాటుచేసిన ఈ భేటీలో పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్, సీఎం అభ్యర్థి షీలా దీక్షిత్, ఎన్నికల ప్రచార వ్యూహకర్త సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. గంటసేపు సాగిన చర్చల్లో ప్రియాంక వీరందరితో మాట్లాడారు. ఆర్‌ఎల్డీ, పీస్ పార్టీ లాంటి చిన్న పార్టీలతో పొత్తులుపెట్టుకోవాలని కొందరు సూచించారు.