ఫేస్బుక్ అకౌంట్ పీకేసిన ఐపీఎస్ అధికారిణి | Probe into facebook post on IPS trainee | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ అకౌంట్ పీకేసిన ఐపీఎస్ అధికారిణి

Published Fri, Sep 12 2014 11:23 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్బుక్ అకౌంట్ పీకేసిన ఐపీఎస్ అధికారిణి - Sakshi

ఫేస్బుక్ అకౌంట్ పీకేసిన ఐపీఎస్ అధికారిణి

మెరిన్ జోసెఫ్.. ఐపీఎస్ ట్రైనీ. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆమె పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, 'మేడమ్.. నన్ను అరెస్టు చేయండి' అంటూ ఆమె కోసం వేడుకోళ్లు. ఒక్క రోజులోనే ఆమెకు 25వేల మంది ఫాలోయర్లు వచ్చేశారు. కొచ్చి నగరానికి కొత్త ఏసీపీగా మెరిన్ జోసెఫ్ వచ్చారంటూ ఒక ఫేస్బుక్ పేజీలో ప్రచురించడంతో మెరిన్ జోసెఫ్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. చివరకు ఈ వ్యవహారం మరీ శ్రుతి మించడంతో ఆమె తన ఫేస్బుక్ అకౌంట్ను డీయాక్టివేట్ చేసిపారేశారు.  

ఫేస్బుక్లో పోస్టులు విపరీతంగా పెరిగిపోవంతో అసలు ముందు ఆమె ఫొటోను ఫేస్బుక్లో ఎవరు పోస్ట్ చేశారోనంటూ కొచ్చి నగర పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వాస్తవానికి ఆమె కొచ్చి ఏసీపీగా బాధ్యతలే స్వీకరించలేదని, ఎవరో తప్పుడు పోస్ట్ పెట్టడంతో అది కాస్తా విస్తృతంగా ప్రచారం అయ్యిందని కమిషనర్ కేజీ జేమ్స్ తెలిపారు. తప్పుడు సమాచారాన్ని ఇలా పంచినవాళ్లపై అవసరమైతే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా, తానింకా శిక్షణలోనే ఉన్నానని, వచ్చే సంవత్సరం జనవరిలోనే తనకు మొదటి పోస్టింగ్ వస్తుందని, వచ్చినప్పుడు తప్పకుండా మీడియాకు చెబుతానని మెరిన్ జోసెఫ్ అన్నారు. ఈలోపు మాత్రం నిరాధార వదంతులు వ్యాప్తి చేయొద్దని తన అభిమానులకు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement