లోక్సభ శుక్రవారం గాడ్సే అంశంపై దద్దరిల్లింది. నిన్న మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడని
న్యూఢిల్లీ : లోక్సభ శుక్రవారం గాడ్సే అంశంపై దద్దరిల్లింది. నిన్న మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడని సంబోధించిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యలపై రెండోరోజు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లోనూ గందరగోళం నెలకొంది. మహారాజ్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను పదినిమిషాలు పాటు వాయిదా వేశారు.