న్యూఢిల్లీ: దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులకు, చొరబాటుదార్లకు ప్రజల మద్దతు లభిస్తోందని, దీన్ని అడ్డుకోకపోతే ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉంటాయని జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ) తన నివేదికలో హెచ్చరించింది. ప్రజలు ఎలా మద్దతిస్తున్నారో ఇందులో వివరించకున్నా.. బాంబు పేలుళ్లకు పాల్పడిన వారికి, స్థానికులకు మధ్య సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య దేశంలో జరిగిన పేలుళ్లను విశ్లేషిస్తూ నివేదిక రూపొందించారు.
నివేదిక ప్రకారం.. ఆయుధాగారాల్లో తయారు చేసిన గ్రెనేడ్ల వంటి వాటిని కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటెంట్లు వాడుతున్నట్లు నేషనల్ బాంబ్ డేటా సెంటర్(ఎన్‌బీడీసీ) సేకరించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో మొత్తం 93 పేలుళ్లు జరగ్గా 39 మంది చనిపోయారు. ఒక్క ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే 48 పేలుళ్లు జరిగాయి.
‘ఉగ్రవాదులకు ప్రజల మద్దతు’
Published Wed, Sep 7 2016 2:10 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
Advertisement
Advertisement