యాప్‌లో రెహమాన్ రాగాలు.. | Rahman's tunes in the App | Sakshi
Sakshi News home page

యాప్‌లో రెహమాన్ రాగాలు..

Published Tue, Aug 19 2014 2:59 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

యాప్‌లో  రెహమాన్ రాగాలు.. - Sakshi

యాప్‌లో రెహమాన్ రాగాలు..

న్యూఢిల్లీ: మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ అభిమానులకో శుభవార్త. ఈ ఆస్కార్ అవార్డు గ్రహీత తన అభిమానుల కోసం ఒక యాప్‌ను ప్రారంభిస్తున్నాడు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో రెహమాన్‌ను అనుసరిస్తున్న దాదాపు రెండున్నర కోట్ల మంది ఇక ఇప్పుడు ‘ఏఆర్ రెహమాన్’ అనే యాప్ ద్వారా అతని గురించి సత్వరం తెలుసుకోవచ్చు.

ఈ యాప్ ద్వారా తన అభిమానులతో రెహమాన్ కూడా ఎప్పటికప్పుడు సన్నిహితంగా ఉంటానంటున్నాడు. ప్రత్యేకమైన విషయాలు, అమ్మకానికి వస్తువులు కూడా ఇందులో పొందుపరచబోతున్నాడు. యాప్ ద్వారా వాటిని అభిమానులు కొనవచ్చు.. లేదా వాటిపై సవాల్ చేయడంద్వారా పాయింట్లు పొందవచ్చు. ఈ యాప్‌ను క్యూకీ.కామ్ సహకారంతో రూపొందించారు. ఈ యాప్ ద్వారా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో రెహమాన్ చేసిన పోస్టుల్ని నేరుగా చూడవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement