తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌ఆర్‌సీలతో మోదీ సర్కార్ దేశంలో సమస్యలను పక్కదారిపట్టిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. తాను భారతీయుడనని నిర్ధారించేందుకు నరేంద్ర మోదీ ఎవరని ప్రశ్నించారు. ఎవరు భారతీయులో..ఎవరు కాదో నిర్ణయించాలని ఆయనకు ఎవరు లైసెన్స్ ఇచ్చారని నిలదీశారు. తాను భారతీయుడనని తనకు తెలుసునని, ఎవరికో దీన్ని నిరూపించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. కేరళలో తన నియోజకవర్గం వయనాద్‌లోని కల్పెట్టా ప్రాంతంలో రాహుల్ పర్యటించారు.
నిరుద్యోగం, ఉద్యోగాల గురించి ప్రశ్నించినప్పుడల్లా మోదీ అనూహ్యంగా ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తారని అన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏలతో ఉద్యోగాలు రావని, సమస్యలతో రగులుతున్న కశ్మీర్, అసోంలు మన యువతకు ఉద్యోగాలను తెచ్చిపెట్టలేవని ఎద్దేవా చేశారు. నాథూరాం గాడ్సే, మహాత్మా గాంధీలవి ఒకటే సిద్ధాంతమని గాడ్సీను తాను విశ్వసిస్తానని చెప్పే ధైర్యం మోదీకి లేకపోవడం ఒక్కటే వ్యత్యాసమని ఆరోపించారు. సేవ్ డెమొక్రసీ ప్రదర్శనలోనూ పాల్గొన్న రాహుల్ గాంధీ మోదీ సర్కార్ విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment