సాక్షి, అహ్మదాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే తనకు ఎంతో గౌరవమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కొన్ని పొరపాట్లు చేసిన మాట వాస్తవమేనని.. అయితే ఈ కారణం వల్ల ఆయనను అగౌరవించాల్సిన పనిలేదని రాహుల్ గాంధీ పూర్కొన్నారు. గుజరాత్‌లోని బనస్కాంతలోలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే.. ప్రధానమంత్రికి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా అవహేళన చేసేవారని.. కాంగ్రెస్‌కు అటువంటి అలవాటు లేదని రాహుల్ గాంధీ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రధాని మోదీని అగౌరవపరచడం లేదని చెప్పారు. అదే సమయంలో భారతీయ జనతాపార్టీ, ప్రధాని మోదీ చేసే పొరపాట్లు, లోపాలు, తప్పులను కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతుందని రాహుల్ గాంధీ తెలిపారు. నేనెప్పుడూ సత్యాలు మాట్లాడతా.. ఇప్పుడ అదే చెబుతున్నా.. గుజరాత్ వికాస్ కాంగ్రెస్‌తోనే సాధ్యం అన్నారు.
నా ట్వీట్లు వాళ్లే చేస్తారు : రాహుల్ గాంధీ
కొంతకాలంగా రాహుల్ గాంధీ ట్వీట్లలో పదును పెరుగుతోంది. ఈ ట్వీట్ల రహస్యాన్ని కూడా రాహుల్ గాంధీ ఆదివారం బయటపెట్టారు. తనకు నలుగురితో కూడిన ట్విటర్ టీమ్ ఉందని ఆయన తెలిపారు. తన అభిప్రాయాలను వారితో పంచుకుంటానని.. అంతేకాక వారికి సూచనలు, సలహాలు ఇస్తానని చెప్పారు. తరువాత ఆ టీమ్ తన ట్విటర్ అకౌంట్‌లో ట్వీట్లు చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. పండగలకు, ఇతర పర్వదినాలకు శుభాకాంక్షలు చెప్పే రొటీన్ వర్క్ ఇష్టంముందని ఆయన స్పష్టం
Comments
Please login to add a commentAdd a comment