కాంగ్రెస్‌-బీజేపీ మధ్య ఆన్‌లైన్‌ మంటలు | Survey gives Congress 65 out of 89 seats | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ : కాంగ్రెస్‌-బీజేపీ మధ్య ఆన్‌లైన్‌ మంటలు

Published Tue, Dec 12 2017 9:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Survey gives Congress 65 out of 89 seats - Sakshi

గుజరాత్‌ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్‌-బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇప్పటికే తొలిదశ పోలింగ్‌ పూర్తయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టినా ఆన్‌లైన్‌ పోల్‌పై అనుకూల వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఆన్‌లైన్‌ పోల్‌లో తొలివిడత ఎన్నికలు ముగిసిన సీట్లలో కాంగ్రెస్‌కు మొత్తం 65 వస్తాయని తేలింది. దీనిపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది.

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌లో జరిగిన తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గణనీయంగా సీట్లు లభించే అవకాశం ఉందని తాజా ఆన్‌లైన్‌పోల్‌ సర్వే ఒకటి ప్రకటించింది. తొలిదశ జరిగిన మొత్తం 89 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ 65 సీట్లను కైవసం చేసుకుంటుందని ఆన్‌లైన్‌ సర్వే తెలిపిం‍ది. తొలిదశ ఓటింగ్‌పై ‘చాణక్యిండియా.ఇన్‌’ అనే వె్‌సైట్‌లో ఆన్‌లైన్‌​ పోల్‌ సర్వే నిర్వహించారు.  ఈ పోల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి 65 సీట్లు వస్తాయన్న మాట.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ నేషనల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ రోహన్‌ గుప్త సైతం.. తొలిదశ ఎన్నికలపై గ్రాఫిక్‌ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘చాణక్యిండియా.ఇన్‌’ సర్వే ఆధారంగా ఈ గ్రాఫిక్‌ ఫొటోను రూపొందించినట్లు తెలిసింది. ఈ సర్వేలో బీజేపీకి కేవలం 22 సీట్లు మాత్రమే వస్తాయని తెలిసింది.

చాణక్యిండియా.ఇన్‌ ఆన్‌ళైన్‌సర్వేపై రోహన్‌ గుప్త మాట్లాడుతూ..  ఇవి పోస్ట్‌పోల్‌ సర్వే కాదని.. స్పస్టం చేశారు. ఒక వెబ్‌సైట్‌లో నిర్వహించిన ఆన్‌లైన్‌ పోల్‌ అని చెప్పారు. ఆన్‌లైన్‌లో పోల్‌లో దాదాపు లక్ష మందిదాకా పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఇది పోస్ట్‌పోల్‌ సర్వే ఎంత మాత్రం కాదని.. ఆయన అన్నారు. సోషల్‌ మీడియా యూజర్లు మాత్రమే ఇందులో పాల్గొన్నారని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ఆన్‌లైన్‌ పోల్‌ సర్వేపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది నకిలీ సర్వే అని ప్రకటించింది. దీనికి టుడేస్‌ చాణక్య పేరును కాంగ్రెస్‌ పార్టీ ఉపయోగించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement