ఆర్‌ఎస్‌ఎస్‌పై వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు సమన్లు
ఆర్‌ఎస్‌ఎస్‌పై వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు సమన్లు
థానే(మహారాష్ట్ర): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినట్లు నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి థానే జిల్లాలోని భివాండి కోర్టు శుక్రవారం సమన్లు జారీచేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మార్చి 6న జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ చరిత్రను వక్రీకరించడమే కాకుండా.. ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులు మహాత్మాగాంధీని హతమార్చారన్న వ్యాఖ్యలతో పరువు నష్టం కలిగించారని ఆర్‌ఎస్‌ఎస్ భివాండి యూనిట్ కార్యదర్శి రాజేశ్ కుంతే కేసుపెట్టారు. దీనిపై విచారణ నిర్వహిస్తున్న మెజిస్టేరియల్ కోర్టు ఈ మేరకు అక్టోబరు 7న హాజరు కావాలంటూ రాహుల్‌ను ఆదేశించింది.