సాక్షి, న్యూఢిల్లీ : మోదీ ముఖంలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ తాను దేశం కన్నా గొప్ప అనుకుంటోందని, మరో మూడు నెలల్లో తమ కంటే దేశమే ఉన్నతమైందని ఆ పార్టీకి అవగతమవుతుందని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మైనారిటీ విభాగం జాతీయ సదస్సును ఉద్దేశించి గురువారం రాహుల్ మాట్లాడుతూ మోదీ సర్కార్‌ను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నియంత్రిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ పగ్గాలు మోదీ చేపట్టినట్టు కనిపిస్తున్నా రిమోట్ కంట్రోల్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉంటుందన్నారు. రాబోయే మూడు నెలల్లో బీజేపీకి తన స్ధానమేమిటో దేశం చూపబోతోందని జోస్యం చెప్పారు. 2017 డోక్లాం ప్రతిష్టంభనను రాహుల్ ప్రస్తావిస్తూ నరేంద్ర మోదీ ఆయన చెప్పుకునేంత ధైర్యవంతుడేమీ కాదని చైనాకూ తెలిసివచ్చిందన్నారు. ప్రధాని మోదీ నేరుగా తనతో పదినిమిషాలు ఒకే వేదికపై చర్చకు వచ్చి తనతో ముఖాముఖి తలపడాలని రాహుల్ బీజేపీకి సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment