'ఏపీ ఎక్స్ప్రెస్ ప్రారంభించడం సంతోషకరం' | Railway Minister Suresh Prabhu launches AP express in delhi | Sakshi
Sakshi News home page

'ఏపీ ఎక్స్ప్రెస్ ప్రారంభించడం సంతోషకరం'

Published Wed, Aug 12 2015 11:01 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM

'ఏపీ ఎక్స్ప్రెస్ ప్రారంభించడం సంతోషకరం' - Sakshi

'ఏపీ ఎక్స్ప్రెస్ ప్రారంభించడం సంతోషకరం'

విశాఖ-ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.  బుధవారం ఉదయం ఢిల్లీలోని రైల్‌ భవన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.  రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.  ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలోని అన్నింటినీ అమలు చేస్తామని తెలిపారు.

విశాఖ రైల్వేజోన్ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  ఏపీ, తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్ట్లపై రైల్వేమంత్రి ...ఎంపీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వెంకయ్య కోరారు. విశాఖ నుంచి విజయవాడ మీదుగా ఢిల్లీ వరకు ఏపీ ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుందన్నారు. సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లే రైలుకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చామన్నారు. ఆగస్టు 15 నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు ఎక్కనుంది. ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టుల పూర్తికి ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు వచ్చారని కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు తెలిపారు. రైల్వేల్లో భద్రత, కొత్త ప్రాజెక్ట్ల పూర్తికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement