తమిళనాడులో భారీ వర్షాలు, వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 325కి పెరిగింది.
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు, వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 325కి పెరిగింది. చెన్నైతో పాటు మరో మూడు జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి. శుక్రవారం చెన్నైలో మళ్లీ భారీ వర్షాలు పడ్డాయి. విద్యుత్ అంతరాయం, తాగునీరు, ఆహారం కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
వేలాదిమంది సైనికులు, స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. తాగునీరు, ఆహారం, దుప్పట్లు సరఫరా చేస్తున్నారు. వర్షం ఆగితే సహాయక చర్యలను వేగవంతం చేయడానికి వీలవుతుంది. తమిళనాడు వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, వివిధ రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి.