
సాక్షి, చెన్నై: రాజకీయ పార్టీ ప్రకటన ఇప్పట్లో ఉండబోదని సినీ నటుడు రజనీకాంత్ చెప్పారు. నాలుగు రోజుల పాటు మలేసియాలో పర్యటించిన ఆయన ఆదివారం రాత్రి చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ ప్రకటన ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా.. ఇప్పట్లో అలాంటి ప్రకటన ఏదీ లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు.