సారీ చెప్పిన హోంమంత్రి | Rajasthan minister using foul language against Manmohan Singh | Sakshi
Sakshi News home page

సారీ చెప్పిన హోంమంత్రి

Published Mon, Jun 20 2016 9:26 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

సారీ చెప్పిన హోంమంత్రి

సారీ చెప్పిన హోంమంత్రి

జైపూర్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చాంద్ కటారియా క్షమాపణ చెప్పారు. పొరపాటుగా అలా మాట్లాడానని అన్నారు. చురాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మన్మోహన్ సింగ్ పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.

'మన్మోహన్ సింగ్ అమెరికా వెళితే ఆయనకు విమానాశ్రయంలో సాధారణ మంత్రులు ఆహ్వానం పలికారు. నరేంద్ర మోదీ అమెరికా వెళితే అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి స్వాగతం పలికారంటూ' అభ్యంతరకర భాష వాడారు. కటారియా వ్యాఖ్యలపై వివాదం రేగడంతో ఆయన క్షమాపణ చెప్పారు.

'నేను వాడిన భాష తప్పే. మాట్లాడుతుండగా మధ్యలో అలా వచ్చేసింది. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నా. మన్మోహన్ సింగ్ ను అవమానించాలనే ఉద్దేశం నాకు లేద'ని కటారియా తెలిపారు. ఆయనపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అశోక్ గెహ్లట్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement