న్యూఢిల్లీ: రష్యాలో మూడు రోజుల పర్యటనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం మాస్కో వెళ్లారు. పర్యటనలో భాగంగా ఆయన రష్యా సైనికాధికారులతో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. దీంతోపాటు రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై సోవియెట్ సేనల విజయానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగే కవాతులో పాల్గొంటారు. అయితే, చైనాతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో చేపట్టిన ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాతో వివాదం తీవ్రరూపం దాల్చినప్పటికీ రష్యాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న సైనిక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని రాజ్‌నాథ్ మాస్కో వెళ్లేందుకు మొగ్గు చూపారని అధికారులు చెప్పారు. విక్టరీ డే పెరేడ్‌లో భారత్, చైనా సహా 11 దేశాలకు చెందిన సైనిక బలగాలు పాల్గొననున్నాయి..
Comments
Please login to add a commentAdd a comment